Sreeleela Latest Viral Video: సోషల్ మీడియా లో నిన్నటి నుండి హీరోయిన్ శ్రీలీల తెగ ట్రెండ్ అవుతోంది. యోగా దినోత్సవం సందర్భంగా నిన్న ముంబై లో ఒక యోగా ఈవెంట్ లో పాల్గొని యోగాసనాలు వేసింది. ఈ కార్యక్రమం లో శ్రీలీలతో పాటుగా బాలీవుడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ సతీమణి అమృత ఫడ్నావిస్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం లో శ్రీలీల వేసిన యోగాసనాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి ట్రోల్స్ కి గురైంది. అదే సమయం లో ఆమెకు సంబంధించిన మరో వీడియో ని చూసి నెటిజెన్స్ జాలి వ్యక్తం చేశారు. సీఎం సతీమణి అమృత పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంతలా అమృత ఏమి చేసింది?, శ్రీలీల బాధపడేంతలా ఆమె ఏమి చేసింది అనేది ఇందులో చూద్దాం.
యోగాసనాల కార్యక్రమం పూర్తి అయ్యాక , తిరిగి వెళ్తున్నప్పుడు మీడియా ఫోటో షూట్ చేశారు. ముందుగా అమృత , ఆమె కూతురు , మరియు శ్రీలీల కలిసి ఫోటో దిగారు. ఇది పూర్తి అయ్యాక, శ్రీలీల ని పక్కకి జరుగు అని సీరియస్ గా అమృత అనడం, దీంతో అక్కడి నుండి శ్రీలీల వెళ్లిపోవడంతో అమృత తన కూతురు తో కలిసి ఫోటోలు దిగడం వంటివి శ్రీలీల అభిమానులను , సోషల్ మీడియా లో నెటిజెన్స్ ని బాధకు గురి చేసింది. ఇండియా లోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మన తెలుగు అమ్మాయి ని , ఇంతలా అవమానించడం ఏ మాత్రం బాగోలేదు, అమృత కి అధికార అహంకారం నెత్తికి ఎక్కిందంటూ మండిపడుతున్నారు నెటిజెన్స్. అయితే ఇందులో అంత బాధ పడాల్సిన అవసరం లేదని , మీడియా రిపోర్టర్స్ అమృత, తన కూతురుతో కలిసి కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇవ్వమని కోరడం వల్లే శ్రీలీల ని పక్కకి జరగమని అమృత రిక్వెస్ట్ చేసిందని, దీనికి రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరమే లేదని అంటున్నారు.
ఈ విషయం లో ఎవరెన్ని మాట్లాడినా శ్రీలీల పాపం బాధపడినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. పక్కకి వెళ్లి ఉండమనగా, శ్రీలీల అక్కడి నుండి వెళ్ళిపోయింది , దీని అర్థమేంటి?, ఆమె మనసు నొచ్చుకున్నది అనే కదా?, సోషల్ మీడియా అంతటా ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది. గతం లో కమెడియన్ మహేష్ విషయం లో కూడా కాంట్రవర్సి అయితే , శ్రీలీల రెస్పాన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో కూడా బాగా వైరల్ అయ్యి వివాదాలకు దారి తీసింది కాబట్టి , దీనిపైనా కూడా శ్రీలీల స్పందిస్తుందో లేదో చూడాలి. సోషల్ మీడియా లో దుమారం రేపుతున్న ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.
View this post on Instagram
