spot_img
Homeఎంటర్టైన్మెంట్Rebel Star Prabhas: మెగాస్టార్, సూపర్ స్టార్ వద్దన్నా.. ప్రభాస్ వినకుండా ...

Rebel Star Prabhas: మెగాస్టార్, సూపర్ స్టార్ వద్దన్నా.. ప్రభాస్ వినకుండా చేసిన ప్లాప్ చిత్రం ?

Rebel Star Prabhas: ప్రభాస్‌ మంచి తనమే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలందుకునేలా చేసింది. ప్రభాస్ వ్యక్తిత్వమే అతన్ని పాన్‌ ఇండియా స్టార్‌ ను చేసింది. ప్రభాస్ కెరీర్‌లో విజ‌య‌వంత‌మైన చిత్రాలున్నా.. అలాగే భారీ ఫ్లాపులు కూడా ఉన్నాయి. కానీ.. ఇది ప్లాప్ అవుతుంది అని తెలిసి కూడా ప్రభాస్ ఆ సినిమా చేయడం కచ్చితంగా గొప్ప విషయం. ఈ కథ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా పడుతుంది అని తెలిసి తెలిసి.. తన కెరీర్ ను ప్రభాస్ రిస్క్ లో పెట్టిన విధానం ప్రభాస్ మంచితనానికి నిదర్శనం.

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో 2005 మార్చి 25న విడుద‌లైన సినిమా చక్రం. ప్రభాస్ కి ఈ కథ నచ్చింది. కృష్ణవంశీకి సినిమా చేస్తా అని మాట ఇచ్చాడు. కథలో హీరో చనిపోతాడు అని తెలుసు. అసలు తెలుగు సినిమాల్లో హీరో చనిపోతే ఎవ్వరూ చూడరు. పైగా ఒక స్టార్ హీరో చనిపోతే ప్రేక్షకులు జీర్ణయించుకోలేరు. అందుకే ప్ర‌భాస్‌ ను ఈ సినిమా చేయ‌వ‌ద్ద‌ని చాలామంది రిక్వెస్ట్ చేశారు.

Also Read: ANR vs NTR and Jr NTR vs Ramcharan: అప్పుడు ఎన్టీఆర్ – ఏఎన్నార్… ఇప్పుడు చరణ్ – జూ. ఎన్టీఆర్

ఓ దశలో కృష్ణవంశీ కూడా మనం వేరే కథ చేద్దాం, ఈ కథ పక్కన పెడదాం అన్నారట. కృష్ణవంశీ ఈ మాట అనడానికి కారణం.. అప్ప‌టికే ఈ కథను మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, చివరకు హీరో గోపీచంద్ కూడా రిజెక్ట్ చేశాడు. వాళ్ళంతా చెప్పింది ఒకే మాట. ఇది తెలుగు సినిమాకి సెట్ కాదు అని. కాబట్టి.. మేము ఈ సినిమా చేయడానికి సాహ‌సం చేయ‌లేము అని.

కృష్ణవంశీకి మెగాస్టార్, మ‌హేష్‌ ల మాటలు గుర్తుకు వచ్చాయి. అయోమయంలో పడిపోయాడు కృష్ణవంశీ. అసలుకే మొహమాటానికి పోయి ప్రభాస్ ఈ సినిమా టేక‌ప్ చేశాడు. వదిలేసే అవకాశం వచ్చింది. మరో హీరో అయితే.. వదిలేసే వాడే. కానీ అక్కడ ఉంది ప్రభాస్ కదా. ప్లాప్ అయితే ఏమిటి ? మంచి కథ, కాబట్టి చేద్దాం అని కృష్ణవంశీకి ధైర్యం చెప్పి.. ఆ సినిమా చేసి పెద్ద ప్లాప్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Rebel Star Prabhas
Prabhas

అయినా, ప్రభాస్ బాధ పడలేదు. కథను మాత్రమే నమ్మాడు. ప్రభాస్ కథను అంత గొప్పగా నమ్ముతాడు కాబట్టే.. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా తెలుగోడి సత్తా చూపించి ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు చేస్తోన్న ‘సలార్’, ‘ఆదిపురుష్’‌, ‘స్పిరిట్‌’లు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రభాస్ ఇలాగే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటూ వెళ్లాలని ఆశిద్దాం.

Also Read:Rajinikanth Basha movie: రజినీకాంత్ లైఫ్ ను మార్చేసిన బాషా మూవీ వెన‌క జ‌రిగిన ప‌రిణామాలు తెలుసా..?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper