Rythu Bima: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనం చేకూర్చడం కొరకు ఎన్నో స్కీమ్స్ అమలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్ రైతుల కోసం అమలు చేస్తున్న స్కీమ్స్ లో రైతు బీమా స్కీమ్ కూడా ఒకటి. ప్రభుత్వం బడ్జెట్ లో ఈ స్కీమ్ కోసం ఏకంగా రూ.24,254 కోట్లు కేటాయించడం గమనార్హం. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న రైతుబంధు స్కీమ్ వల్ల రైతులకు ఎంతో బెనిఫిట్ కలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ తో పాటు రైతులకు మరింత బెనిఫిట్ కలగాలనే ఆలోచనతో ప్రభుత్వం రైతు బీమా స్కీమ్ ను అమలు చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ కు అర్హత కలిగి ఉన్న రైతులకు రైతు బీమా స్కీమ్ ను అమలు చేస్తోంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు. ఆధార్ కార్డ్ ద్వారా రైతు యొక్క వయస్సును నిర్ధారిస్తారు. ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ఆధారంగా ఊరిలో భూములు ఉన్నవాళ్లకు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హత లభిస్తుంది.
వేరే ప్రాంతంలో భూములను కలిగి ఉంటే మాత్రం ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందడం సాధ్యం కాదు. పార్మర్స్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈ స్కీమ్ అసలు పేరు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ఏదైనా కారణం వల్ల రైతు మరణిస్తే రైతు కుటుంబీకులకు 5లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయనుంది. ప్రభుత్వం ఎల్.ఐ.సీకి ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఏదైనా కారణం వల్ల రైతు మరణిస్తే నామినీ బ్యాంక్ అకౌంట్ లో ఈ స్కీమ్ కు సంబంధించిన నగదు జమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిన్న సన్నకారు రైతులు ఈ స్కీమ్ కు అర్హులు. 040 2338 3520 నంబర్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
[…] Also Read: Rythu Bima: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఈ స్కీమ్ … […]