Jobs: సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 14 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా లెక్చరర ఉద్యోగ ఖాళీలతో పాటు అసిస్టెంట్ ప్లేస్ మెంట్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ ట్రైనీ, ఇన్ స్ట్రక్టర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
https://www.cipet.gov.in/job-opportunities/contractual_positions.php వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 2022 సంవత్సరం మే 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. అయితే ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. సంస్థ ఔరంగాబాద్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 25,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ సంస్థ ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల సంబంధిత సంస్థ కాగా అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
బీఈ, బీటెక్, ఎం.ఈ, ఎంటెక్, డీపీటీ, డీపీఎంటీ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి చాలా సమయం ఉన్నా అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.