ANR vs NTR and Jr NTR vs Ramcharan: తెలుగు సినిమా పరిధి పెరుగుతున్న కాలం అది. కానీ, సినిమా హీరోల మధ్య అప్పటి సమాజంలో కూడా తీవ్రమైన పోటీ ఉండేది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో చరణ్ – ఎన్టీఆర్ అభిమానుల ఎలా ఘర్షణ జరుగుతుందో.. అప్పట్లో కూడా ఈ స్థాయిలోనే చర్చలు జరిగేవి. అలాంటి టైంలో ఇండస్ట్రీకి వచ్చారు ఎన్టీఆర్, ఏఎన్నార్. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ముందుగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.

ANR vs NTR
కానీ, అప్పటి వారిలో చాలామంది నటీనటులు చెడు అలవాట్లకు బానిసలైన వాళ్లే ఎక్కువ. అందుకే సినిమా వాళ్ళ పై గౌరవం ఉండేది కాదు. ఆ తరువాత ఎన్టీఆర్, ఏఎన్నార్ క్రమశిక్షణ కారణంగా ఆ అభిప్రాయం క్రమక్రమంగా మారుతూ వచ్చింది. సినిమా వాళ్లల్లో కూడా కొంతమంది ఎంతో గొప్పగా సిస్టమేటిక్ గా ఉంటారని నమ్మకం కలిగింది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇద్దరి హీరోల మధ్య పోటీ కూడా పెరిగింది.
Also Read: Vadde Naveen- NTR: ఎన్టీఆర్ కు వడ్డే నవీన్ బావ అవుతాడని మీకు తెలుసా..?
ఎన్టీఆర్ సినిమా హిట్ అయితే.. ఏఎన్నార్ సినిమా శతదినోత్సవం ఆడేది. అంతలో ఎన్టీఆర్ మరో సినిమా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఆడేది. ఇలా ఒకరిని మించి ఒకరు హిట్లు కొట్టారు ‘ఎన్టీఆర్ – ఏఎన్నార్’. ఇద్దరూ కలెక్షన్ల విషయంలో ఎన్నో రికార్డులు తిరగరాశారు. ముఖ్యంగా పౌరాణికాలు, జానపదాలతో ఎన్టీఆర్ తిరుగులేని హిట్లు ఇస్తే… ఏఎన్నార్ సాంఘికాలతో పోటీ ఇచ్చేవారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ – ఏఎన్నార్ సినిమాల మధ్య గట్టి పోటీ ఉండేది.

ANR vs NTR
ఒకసారి ఎన్టీఆర్ గెలిస్తే.. మరోసారి ‘ఏఎన్నార్ – ఎన్టీఆర్’ పోటీ ఇచ్చేవారు. అభిమాన సంఘాలు కొట్టుకున్న దాఖలాలు ఉన్నా.. హీరోలిద్దరూ మాత్రం అన్నదమ్ముల్లా కలిసే ఉండేవాళ్లు. అయితే, వీరి చిత్రాలు ఒకే రోజే విడుదలైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 1967లో ఎన్టీఆర్ ‘భువనసుందరి కథ’, ఏఎన్నార్ ‘గృహలక్ష్మి’ చిత్రాలు 1967 ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యాయి.
ఈ పోటీలో ఎన్టీఆర్ ‘భువనసుందరి కథ’ విజయం సాధించింది. ఏఎన్నార్ ‘గృహలక్ష్మి’ సినిమా పరాజయం పాలైంది. అదే ఏడాది ఆగస్టులో కూడా ఎన్టీఆర్, ఏయన్నార్ లు ఒక్కరోజే పోటీ పడ్డారు. కాకపోతే, ఈ సారి ఎన్టీఆర్ ‘నిండుమనసులు’ సాంఘికం కాగా, ఏఎన్నార్ ‘వసంతసేన’ జానపదం. యస్.డి.లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ ‘నిండు మనసులు’ సినిమా బ్లాక్-అండ్ వైట్ ఫిల్మ్.

ANR vs NTR
కానీ, ఏఎన్నార్ ‘వసంతసేన’ మాత్రం కలర్ మూవీ. ఈ రెండోసారి పోటీలో కూడా ఎన్టీఆరే పైచేయి సాధించి అఖండ విజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి హీరోల మధ్య పోటీ సర్వసాధారణం అయిపోయింది. బహుశా ఆ పోటీనే సినిమా ఇండస్ట్రీకి వారసత్వంగా వచ్చి ఉంటుంది.
Also Read:Rajinikanth Basha movie: రజినీకాంత్ లైఫ్ ను మార్చేసిన బాషా మూవీ వెనక జరిగిన పరిణామాలు తెలుసా..?