Homeఎంటర్టైన్మెంట్Jr NTR Venkatesh movie: ఎన్టీఆర్ సినిమాలో వెంకటేష్...కాంబినేషన్ అదుర్స్ కదా...

Jr NTR Venkatesh movie: ఎన్టీఆర్ సినిమాలో వెంకటేష్…కాంబినేషన్ అదుర్స్ కదా…

Jr NTR Venkatesh movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. కెరియర్ స్టార్టింగ్ లోనే మాస్ హీరోగా అవతరించిన ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ ను అందుకున్నాడు. ఇక అప్పటినుంచి వస్తున్న వరుస సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చో బెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్యలో కొంతవరకు తడబడినప్పటికి ఆయన వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా […]

Jr NTR Venkatesh movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. కెరియర్ స్టార్టింగ్ లోనే మాస్ హీరోగా అవతరించిన ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ ను అందుకున్నాడు. ఇక అప్పటినుంచి వస్తున్న వరుస సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చో బెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్యలో కొంతవరకు తడబడినప్పటికి ఆయన వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ‘దేవర’ సినిమాతో 500 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ‘వార్ 2’ సినిమాతో ఏమాత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయాడు. దాంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా విషయంలోనే చాలా ఆశలైతే పెట్టుకున్నాడు.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సైతం ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చాలా వరకు గోప్యంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారట. థియేటర్ కి వెళ్లేంతవరకు ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా లీక్ చేయకూడదని సినిమా యూనిట్ కి అనుకున్నప్పటికి కొంతమంది వల్ల ఈ న్యూస్ బయటకి వచ్చింది.

వెంకటేష్ ఈ సినిమాలో ఒక 5 నిమిషాల క్యారెక్టర్ ని పోషిస్తున్నాడట. మరి అది ఎలాంటి క్యారెక్టర్ పాజిటివ్ గా ఉండబోతుందా? లేదంటే నెగెటివ్ క్యారెక్టరా? అనేది ఇంకా తెలియదు కానీ మొత్తానికైతే ఈ సినిమాలో అతను భాగమవుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి…

ఇప్పటివరకు వెంకటేష్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాలేదు. అయితే వెంకటేష్ హీరోగా చేసిన ‘చింతకాయల రవి’ సినిమాలో ఎన్టీఆర్ ఒక పాట కి డాన్స్ వేశాడు. ఇక వీళ్ళిద్దరికి పర్సనల్ లైఫ్ లో కూడా చాలా మంచి బాండింగ్ ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో వీళ్లిద్దరూ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper