spot_img
Homeఎంటర్టైన్మెంట్Surya: సూర్య తో కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్న బాలివుడ్ స్టార్ హీరో...

Surya: సూర్య తో కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్న బాలివుడ్ స్టార్ హీరో…

Surya: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటులలో సూర్య మొదటి స్థానంలో ఉంటాడు. తను చేసిన గజినీ సినిమా నుంచి కంగువా సినిమా వరకు ప్రతి సినిమా విషయంలో అతను పర్ఫెక్షన్ అనేది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లేకపోవడం నిజంగా మన దురదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక పాత్ర కోసం ఎంతలా అయినా సరే కష్టపడతాడు. దానికి సంబంధించిన మేకోవర్ ను సంపాదించుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటాడు.ఇక ఒక వ్యక్తి సిక్స్ ప్యాక్ ని మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ సూర్య మాత్రం ఎప్పుడూ సిక్స్ ప్యాక్ ని మెయిటైన్ చేస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ మరొక సినిమా అయితే చేయలేదు. ఇక ఇలాంటి క్రమంలోనే తను చేయబోయే సినిమాలో సూర్యని హీరోగా తీసుకుని మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంలో అమీర్ ఖాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి అయితే సూర్య చేసిన గజినీ సినిమాని హిందీలో అమీర్ ఖాన్ అదే పేరుతో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

కాబట్టి అప్పటినుంచి వీళ్ళ మధ్య మంచి బాండింగ్ అయితే కుదిరింది. అందుకే సూర్య చేసే సినిమాలను చేయడానికి అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. కానీ ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకుంటున్నాడు. కాబట్టి అమీర్ ఖాన్ ఇప్పుడు తను నెక్స్ట్ చేయబోయే సినిమాలో తన తమ్ముడి క్యారెక్టర్ లో సూర్యని తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఆ క్యారెక్టర్ కి కూడా హీరోతో సమానమైన స్క్రీన్ టైమ్ ఉండటమే కాకుండా ఆ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటుందట. అందువల్లే ఆ పాత్ర కోసం సూర్య ని తీసుకోబోతున్నట్టుగా అమీర్ ఖాన్ తన సన్నిహితుల దగ్గర తెలియజేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక సూర్య మాత్రం దీని మీద ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు. ఒక రకంగా తనకి ఆ సినిమా చేయడం ఇష్టం ఉందా లేదా అనే విషయాన్ని కూడా తను బయటికి చెప్పలేకపోతున్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కంగువా సినిమా మీదనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక తన మనసులోని మాటను బయట పెడుతాడేమో చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

America Politics

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper