Bigg Boss Telugu 8: గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ కి బయట తమ గురించి జనాలు ఏమి అనుకుంటున్నారు అనేది చాలా తక్కువగా తెలిసేది. ఫ్యామిలీ వీక్ లో మాత్రమే టాప్ 5 లో ఎవరెవరు ఉండబోతున్నారు అనే విషయంపై క్లారిటీ వచ్చేది. కానీ ఈ సీజన్ అలా లేదు. 5వ వారం నుండి కంటెస్టెంట్స్ కి ఒక్కొక్కరి గ్రాఫ్ ఎలా ఉందో వాళ్లకు అర్థం అయ్యేలా చేసాడు బిగ్ బాస్. ముందుగా అప్పట్లో నిఖిల్, నబీల్, మణికంఠ వంటి వారు టాప్ లో ఉన్నట్టు కంటెస్టెంట్స్ కి ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమేషన్ రోజున అర్థమైంది. కంటెస్టెంట్స్ ముఖ్యంగా మణికంఠ కి ఇంత ఓటింగ్ ఎలా వచ్చింది?, ఇతన్ని తెలివిగా ఎలా అయినా తొక్కేయాలి అని స్ట్రాటజీలు వేశారు. ఇక ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చాక పూర్తిగా సీన్ మారిపోయింది. అప్పటి వరకు టైటిల్ విన్నింగ్ రేస్ లో నిఖిల్, నబీల్ మాత్రమే ఉండేవారు.
కానీ గౌతమ్ కృష్ణ వచ్చిన తర్వాత టైటిల్ రేస్ నిఖిల్, గౌతమ్ కి మధ్య మాత్రమే ఉందని తేలిపోయింది. వాస్తవానికి గౌతమ్ గ్రాఫ్ బయట ఈ రేంజ్ లో ఉందని హౌస్ లో ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ లో ఒక్కొక్కరి ఫ్యామిలీ లోపలకు అడుగుపెట్టి గౌతమ్ గ్రాఫ్ గురించి బయట ఎలా ఉందో ఒక ఐడియా ఇవ్వడంతో అందరూ షాక్ కి గురయ్యారు. గౌతమ్ ఏమి అంతగా ఆడుతున్నాడు, అసలు జరుగుతుంది బయట అంటూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఇక వీకెండ్ లో వచ్చిన అతిథులు ప్రతీ ఒక్కరు గౌతమ్ ని టాప్ 5 లో పెట్టడం ఓజీ క్లాన్ వారు జీర్ణించుకోలేకపోయారు. ఇక నిన్న హౌస్ లో సంచాలక్స్ గా టాస్కులు నిర్వహించడానికి వచ్చిన అఖిల్, హారికలు బయట గౌతమ్ రేంజ్ ఎలా ఉందో స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చేసారు.
అఖిల్ మాట్లాడుతూ ‘బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ కంటెస్టెంట్ గ్రాఫ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఈ వారం కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్న కంటెస్టెంట్ నేడు విన్నర్ రేంజ్ కి ఎదిగిపోయాడు’ అంటూ గౌతమ్ ని ఉద్దేశిస్తూ అఖిల్ చెప్తాడు. ఈ విషయం చెప్పగానే అవినాష్, తేజ, రోహిణి లు గౌతమ్ వైపు చూస్తాడు. నబీల్, ప్రేరణ అయితే అసూయతో రగిలిపోతారు. ఇది కాసేపు పక్కన పెడితే నిన్న అఖిల్, హారిక విష్ణు ప్రియ కి హిత భోద చేసే ప్రయత్నం చేసారు. ‘నీకు అతనంటే ఇష్టం ఉండొచ్చు కానీ, మరీ నీ గేమ్ ని ప్రభావితం చేసేంత ఇష్టం మాత్రం మాకు కరెక్ట్ కాదు అనిపించింది’ అని అంటాడు అఖిల్. దీనికి విష్ణు మాట్లాడుతూ మాస్కులు వేసుకొని హౌస్ లో బ్రతకడం నా వల్ల కాదు, నేను ఇలాగే ఉంటాను, ఆడియన్స్ నచ్చితే హౌస్ లో కొనసాగుతాను, లేదంటే ఎలిమినేట్ అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. హారిక కూడా విష్ణు ప్రియ కి వివరించే ప్రయత్నం చేస్తుండగా, నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నువ్వు ఎందుకు కలుగచేసుకుంటావు అంటూ హారిక పై మండిపడుతాడు అఖిల్. అలా వీళ్లిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం నడుస్తుంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bigg boss telugu 8 akhil who leaked about gauthams craze to the house mates akhil who fought with harika for vishnupriya
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com