Bigg Boss 9 : తెలుగు బుల్లితెర పై అత్యంత ప్రజాధారణ పొందిన రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ని సంపాదించుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ని ముందుగా హిందీ లో ప్రారంభించారు. అక్కడ పెద్ద హిట్ అవ్వడంతో కన్నడ, తెలుగు, తమిళం ,మలయాళం భాషల్లో లో కూడా ప్రారంభించారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. తెలుగు లో ఇప్పటి వరకు 8 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. 8 వ(Bigg Boss 8 Telugu) సీజన్ భారీ అంచనాల నడుమ మొదలైంది కానీ, చివరకి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కానీ ఈసారి బిగ్ బాస్ టీం 9వ(Bigg Boss 9 Telugu) సీజన్ ని కనీవినీ ఎరుగని రేంజ్ లో ప్లాన్ లో చేసారు. గత సీజన్ లో కేవలం ఇద్దరు ముగ్గురు తప్ప, ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని ముఖాలనే తీసుకొచ్చారు.
కానీ ఈసారి మాత్రం అలా కాదు, ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీస్ ని కంటెస్టెంట్స్ గా తీసుకొస్తున్నారు. అలా మంచి పేరున్న సెలబ్రిటీస్ ని తీసుకొస్తే, కచ్చితంగా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు అని బిగ్ బాస్ టీం బలంగా నమ్ముతుంది. బడ్జెట్ కూడా ఈ సీజన్ కి భారీ గానే ఉండనుంది. ఇకపోతే హోస్ట్ కూడా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడవ సీజన్ నుండి 8 వ సీజన్ వరకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. కానీ 8వ సీజన్ కి నాగార్జున తీవ్రమైన నెగటివిటీ ని ఎదురుకున్నాడు. అసలు ఆ సీజన్ యావరేజ్ అవ్వడానికి ముఖ్య కారణం నాగార్జున(Akkineni Nagarjuna) హోస్టింగ్ అనే విమర్శలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వచ్చాయి. అందుకే ఆ నెగటివిటీ ని తట్టుకోలేక, ఈ సీజన్ 9 నుండి తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఆయన స్థానంలోకి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ని హోస్ట్ గా తీసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారట. కానీ బాలయ్య బాబు ససేమీరా నో చెప్పినట్టు సమాచారం. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ ని సంప్రదించారట. ఈ ఆఫర్ వచ్చినప్పుడు ప్రారంభంలో కాస్త తడబడ్డాడు కానీ, ఆ తర్వాత మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం తో కాదు అనలేక ఒప్పుకున్నాడట. ఈ సీజన్ నిర్వహించడానికి ఆయనకు దాదాపుగా 15 కోట్ల రూపాయిలు డిమాండ్ చేసినట్టు సమాచారం. అంతే కాకుండా బిగ్ బాస్ హోస్టింగ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కి ఒక సరికొత్త ఛాలెంజ్ గా అనిపించిందట. అందుకే ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి. ఇకపోతే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి ఇప్పటి నుండే సోషల్ మీడియా లో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి కానీ, ఇప్పటి వరకు టీం ఎవరినీ సంప్రదించలేదు అనేది వాస్తవం.
Also Read : ఏంటీ.. అప్పుడే బిగ్ బాస్ తెలుగు 9 వచ్చేస్తుందా? షాకింగ్ డిటైల్స్