spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 8 Telugu: 'బిగ్ బాస్ 8 తెలుగు' బజ్ కి ఊహించని యాంకర్.....

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ 8 తెలుగు’ బజ్ కి ఊహించని యాంకర్.. ఎవరో గుర్తుపట్టగలరా?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ కి సంబంధించి ఏ న్యూస్ బయటకి వచ్చినా సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ 8వ సీజన్ పై అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కోసారి అంచనాలకు తగ్గట్టుగా ఏదైనా లేకపోతే దారుణమైన ఫలితాలు వస్తుంటాయి. ఇది బిగ్ బాస్ సీజన్ 6 విషయం లో జరిగింది. భారీ అంచనాల నడుమ ప్రసారమైన ఈ సీజన్ కి డిజాస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. కనీసం ఫైనల్ ఎపిసోడ్ కి కూడా అనుకున్న స్థాయి లో రేటింగ్స్ రాలేదు. ఆ భయం బిగ్ బాస్ టీం లో అలాగే ఉంది. అందుకే ఈ సీజన్ ఎక్కడా తగ్గకుండా, సీజన్ 7 ని మించేలా ప్లాన్ చేసారు. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి మీరంతా సోషల్ మీడియా లో ప్రతీ రోజు చూస్తూనే ఉన్నారు.

అయితే ఈ సీజన్ ‘బిగ్ బాస్’ బజ్ ఎపిసోడ్స్ కి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు అనేదానిపై కొంతకాలం సస్పెన్స్ నడిచింది. గత సీజన్ లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిల్చిన శివాజీ హోస్ట్ గా వ్యవహరిస్తాడని అనుకున్నారు. కానీ ఆయన ఎందుకో ఒప్పుకోలేదు, ఆ తర్వాత అమర్ దీప్, శోభా శెట్టి పేర్లను పరిశీలించారు కానీ, చివరికి అంబటి అర్జున్ ని ఫిక్స్ చేసారు. దీనికి సంబంధించిన ప్రోమో ని ఇటీవలే విడుదల చేసారు. ఈ ప్రోమో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా మితభాషి లాగా అనిపించే అంబటి అర్జున్ లో ఇంటర్వ్యూ చేసే స్కిల్స్ ఉన్నాయా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఉండేవి. కానీ టాస్కులు అయినా , ఏదైనా తాను తీసుకున్న రోల్ కి నూటికి నూరు శాతం న్యాయం చేయగలడని, ఈ ప్రోమో ని చూసిన తర్వాతనే అర్థం అయ్యింది. ఈ ప్రోమో లో అర్జున్ మాట్లాడుతూ ‘టైం బాగున్న వారు బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు..టైం బాగాలేని వాళ్ళు ఇక్కడకి వచ్చి కూర్చుంటారు..గుర్తు పెట్టుకోండి, హౌస్ లో మీరు తీసుకునే ప్రతీ నిర్ణయానికి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సీటు యమ హాటు’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ ప్రోమో చూస్తుంటే అంబటి అర్జున్ కంటెస్టెంట్స్ ని నిర్మొహమాటంగా, ఏమి అడగాలని అనుకుంటున్నాడో, అది అడిగేస్తాడని అనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ ఒక సారి గమనిస్తే ఆదిత్య ఓం, బెజవాడ బేబక్క, అంజలి పవన్, ఇంద్రనీల్, యాంకర్ విష్ణు ప్రియా, నిఖిల్, యష్మీ గౌడా, డ్యాన్సర్ నైనికా, శేఖర్ భాష , రీతూ చౌదరి, హీరోయిన్ యశస్వినీ తదితరులు సెప్టెంబర్ 1 న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper