Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Winner VJ Sunny : డబ్బులు కాజేసి కారులో పారిపోయిన బిగ్...

Bigg Boss 5 Winner VJ Sunny : డబ్బులు కాజేసి కారులో పారిపోయిన బిగ్ బాస్ విన్నర్… సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Bigg Boss 5 Winner VJ Sunny  : బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజే సన్నీ దొంగతనానికి పాల్పడ్డాడు. ఒక ఏటీఎంలో డబ్బులు కాజేసి,క్యాష్ బ్యాగ్ తో పాటు కారులో పారిపోయాడు. విజే సన్నీ రాబరీ కి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న సన్నీ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఫైనల్ లో షణ్ముఖ్ జస్వంత్-విజే సన్నీ టైటిల్ కోసం పోటీపడ్డారు. షణ్ముఖ్ కంటే అధిక ఓట్లు సంపాదించిన విజే సన్నీ టైటిల్ తో పాటు ప్రైజ్ మనీ అందుకున్నాడు.

సీరియల్ నటుడైన విజే సన్నీ బిగ్ బాస్ విన్నర్ గా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ షో ఆయనకు ఇమేజ్ తెచ్చింది. ఈ క్రమంలో సన్నీకి హీరోగా ఆఫర్స్ వస్తున్నాయి. గత ఏడాది సకలకళాభిరామ టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఆ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇంతలో అతడు దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

అయితే ఇది నిజమైన దొంగతనం కాదు లెండి. జస్ట్ పబ్లిసిటీ స్టంట్. ఈ మధ్య కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం చిన్నా చితకా హీరోలు ఈ టెక్నిక్ వాడుతున్నారు. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ ప్రమోషన్ కోసం చేసిన పని విమర్శల పాలైంది. లక్ష్మణ్ అనే వ్యక్తి రోడ్డుపై కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకుంటానని హంగామా చేశాడు. హెవీ ట్రాఫిక్ రోడ్లపై ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టడం ఏమిటని… విశ్వక్ సేన్ ని సోషల్ మీడియా ద్వారా జనాలు ఏకిపారేశారు.

అలాగే బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో నందు… నేరుగా రష్మీ గౌతమ్ షూటింగ్ చేస్తున్న స్టూడియోకి వెళ్లి గొడవ పడినట్లు ఓ వీడియో విడుదల చేశాడు. సన్నీ సైతం అలాగే సెన్సేషన్ క్రియేట్ చేసి, తన కొత్త సినిమాకు ప్రచారం తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. అన్ స్టాపబుల్ టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో సన్నీ హీరోగా నటించాడు. డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన అన్ స్టాపబుల్ మూవీలో సప్తగిరి మరో హీరోగా నటించాడు. అన్ స్టాపబుల్ విడుదలకు సిద్ధం అవుతుండగా… సన్నీ ఇలా జనాలకు ఝలక్ ఇచ్చాడు.

https://youtu.be/gbDQB5G4Htw

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper