spot_img
Homeఎంటర్టైన్మెంట్అదిరేటి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. అతడు మళ్లీ సేఫ్..

అదిరేటి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. అతడు మళ్లీ సేఫ్..

Amma Rajasekhar Bigboss
బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ రియల్టీ షో ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిన్నటితో బిగ్ బాస్ నాలుగో సీజన్ 8వారాన్ని పూర్తి చేసుకొని 9వ వారంలోకి అడుగుపెడుతోంది. 8వ వారం చివరి రోజును యథావిధిగా హోస్టు నాగార్జున కంటెస్టులతో ఆటలు ఆడించి ఎలిమినేషన్ పూర్తి చేశారు. అయితే చివర్లో ఎవరూ ఊహించని విధంగా ట్వీస్ట్ ఇచ్చి అందరినీ షాక్ కు గురిచేశాడు.

Also Read: సుధీర్.. రష్మీల బంధాన్ని లీక్ చేసిన గెటప్ శ్రీను..!

మ్యూజిక్ గేమ్.. ఒకరినొకరు అనుకరణ చేసుకోవడం వంటి గేమ్స్ ను బిగ్ బాస్ కంటెస్టులచే ఆడించాడు. మ్యూజిక్ గేమ్ రికార్డు డాన్స్ తరహాలో సాగగా.. అనుకరణ హౌస్ లో నవ్వులు పూయించింది. ఇదిలా ఉండగా ఎలిమినేషన్స్ లో ఉన్న ఆరుగురు కంటెస్టుల్లో మొనాల్.. అరియానా.. లాస్యలు సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. శనివారం అఖిల్ సేవ్ అయ్యాడు. దీంతో మిగతా ఇద్దరిలో టెన్షన్ నెలకొంది.

ఎలిమినేషన్లో అమ్మ రాజశేఖర్.. మోహబూబ్ మిగిలిపోయారు. దీంతో ఇంటి సభ్యులతో నాగార్జున మాట్లాడుతూ హౌస్ లో ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదని అడుగగా ఆరుగురు సభ్యులు అమ్మరాజశేఖర్ కు వ్యతిరేకంగా ఇద్దరు సభ్యులు మోహబూబ్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇక ఓటింగులోనూ అమ్మ రాజశేఖర్ కు అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో అతడు ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించారు.

Also Read: వాల్మీకి బర్త్ డే.. వాళ్లపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

ఆ వెంటనే మోహబూబ్ సేఫ్ అని అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు. దీంతో రాజశేఖర్ ఇంటి నుంచి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. అందరికీ విడ్కోలు పలికిరా అంటూ నాగార్జున సూచించడంతో ఇంటిలోకి వెళ్లాడు. అమ్మ రాజశేఖర్ తన సూట్ కేసు పట్టుకొని వస్తుండగా నువ్వు సేఫ్ అంటూ ప్రకటించాడు. దీంతో అందరూ ఖంగుతిన్నాడు. నోయల్ ఇంటి నుంచి వెళుతూ ఈ వారం ఎవరినీ ఎలిమినేషన్ చేయద్దని బిగ్ బాస్ ను కోరినట్లు క్లారిటీ ఇచ్చాడు.

అయితే అమ్మ రాజశేఖర్ మాత్రం తనను ఇంటి నుంచి పంపించాలని కోరడంతో నాగార్జున అతడికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ వారం అందరికీ కంటే తక్కువ ఓట్లు నీకే వచ్చినందునా నిన్నే కెప్టెన్సీ కోసం నేరుగా నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో రాజశేఖర్ ఎలిమినేషన్ తప్పించుకొని ఏకంగా కెప్టెన్ గా నిలిచాడు. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ట్వీస్ట్ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. 9వ వారం అమ్మ రాజశేఖర్ కు  కెప్టెన్సీ దక్కడంతో ఈ వారం ఎలిమినేషన్ రసవత్తరంగా మారడం ఖాయంగా కన్పిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
Oktelugu Epaper