Homeఎంటర్టైన్మెంట్Bhumika Chawla: వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న భూమిక.. రాత్రంతా నిద్ర పట్టలేదంటూ షాకింగ్ కామెంట్స్..వీడియో వైరల్!

Bhumika Chawla: వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న భూమిక.. రాత్రంతా నిద్ర పట్టలేదంటూ షాకింగ్ కామెంట్స్..వీడియో వైరల్!

Bhumika Chawla: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ ని ఉర్రూతలూ ఊగించిన ప్రముఖ హీరోయిన్ భూమిక(Bhumika Chawla), ఇప్పటికీ సినిమాలు చేస్తూ నేటి తరం ఆడియన్స్ ని కూడా అలరిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. కేవలం హీరోయిన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ, మంచి కథ దొరికినప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తన మార్క్ ని చూపిస్తూనే ఉంది ఈమె. నేడు ఈమె ప్రధాన పాత్ర పోషించిన ‘యూఫోరియా'(Euphoria Movie) అనే చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గుణ శేఖర్(Gunashekar) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే ఆడియన్స్ నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ‘ఒక్కడు’ చిత్రం తర్వాత గుణశేఖర్ దర్శకత్వం లో భూమిక నటించిన సినిమా ఇదే. ‘ఒక్కడు’ చిత్రం తన కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లాగా ఎలా అయితే నిల్చిపోయిందో, ఈరోజు విడుదలైన ‘యూఫోరియా’ చిత్రం కూడా అలా మైల్ స్టోన్ లాగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.

అయితే రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భూమిక వేదిక పై మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇప్పటి వరకు ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఏ సినిమాకు కూడా ఇంత ఎమోషనల్ అవ్వడం ఆడియన్స్ చూడలేదు. అలాంటిది ఈ సినిమా గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ ‘ఇది చాలా బోల్డ్ సబ్జెక్ట్. ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా ధైర్యం కావాలి. రిస్క్ తీసుకోవాలి, సమాజానికి ఎదో ఒక మంచి చెప్పాలి అనే తపన కూడా ఉండాలి. నిన్న ఈ సినిమా చూసిన తర్వాత రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఎంతో భావోద్వేగానికి గురయ్యాను’ అంటూ కంటతడి పెట్టుకుంది భూమిక. ఈ వీడియో ని మీరు క్రింద చూడవచ్చు. చాలా కాలం తర్వాత మరోసారి ఆమెకు నటనకు ఫుల్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది.

డైరెక్టర్ గుణ శేఖర్ కి కూడా ఇది ఊర మాస్ కం బ్యాక్ అనే చెప్పాలి. ఆయన గత చిత్రం ‘శాకుంతలం’ భారీ బడ్జెట్ తో భారీగా తీసాడు. కానీ కమర్షియల్ గా ఆ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. కానీ ఈ సినిమాని ఆయన ఎలాంటి బడ్జెట్ లేకుండా, ఒక్కటంటే ఒక్క VFX షాట్ ని కూడా ఉపయోగించకుండా, చాలా చక్కగా తీర్చిదిద్దాడు. సమాజానికి ఎదో చెప్పాలి అని నిజాయితీ తో ఈ చిత్రాన్ని తీసాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాగో సంక్రాంతి సినిమాల జోరు తగ్గిపోయింది. కాబట్టి ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
Oktelugu Epaper