spot_img
Homeఎంటర్టైన్మెంట్Bhole Shavali: బిగ్ బాస్ టాప్ 5 ఎవరో తేల్చేసిన భోలే షావలి... అదే జరిగితే...

Bhole Shavali: బిగ్ బాస్ టాప్ 5 ఎవరో తేల్చేసిన భోలే షావలి… అదే జరిగితే సంచలనమే!

Bhole Shavali: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ భోలే షావలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాట బిడ్డగా హౌస్ లో అడుగుపెట్టి.. తనదైన శైలిలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. అప్పటికప్పుడు పాటని కంపోజ్ చేసి పాడటంలో భోలే కి ఎవరు సాటి రారు. అయితే వైల్డ్ కార్డు ద్వారా ఐదో వారంలో హౌస్ లోకి అడుగుపెట్టిన భోలే పదో వారంలో ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన హౌస్ లో ఉన్న వాళ్ళ లో టాప్ 5 లో ఎవరు ఉంటారో అంచనా వేశాడు.

భోలే మాట్లాడుతూ .. ‘ బిగ్ బాస్ ఇంటిలోకి ఎలాంటి ప్లాన్ చేసుకుని, సోషల్ మీడియాకి సంబంధించి పీఆర్ డిజైన్ చేసుకుని వెళ్ళలేదు. పాట బిడ్డగా ఇంట్లోకి వెళ్లి .. పాట బిడ్డగా రావాలని అనుకున్నాను. వారం రోజులు ఉన్నాగాని.. నా అస్థిత్వాన్ని అక్కడే వదిలి రావాలని అనుకున్నాను. అలా 5 వారాలు ఇంట్లో ఉండి వచ్చాను అని భోలే అన్నారు.

ఇంటిలో నేను అడుగుపెట్టేసరికి రెండు గ్రూపులు బలంగా ఉన్నాయి. సీరియల్ బ్యాచ్ అందరూ ఒకటిగా ఆడుతున్నారు. శివాజీ గ్రూప్ మరో వైపు ఆడుతున్నారు. నేను కేవలం ఎంటర్టైనర్ గా ఇంటిలో పాటలు పాడుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాను. అయితే నన్ను సీరియల్ బ్యాచ్ దారుణంగా ఎటాక్ చేయడంతో మిస్ అయ్యి కొన్ని సార్లు బూతులు మాట్లాడినా .. వెంటనే సరిదిద్దుకుని సారి చెప్పను. తన తప్పును తాను తెలుసుకున్న వాడికంటే ఉత్తముడుండడు అనేది నా అభిప్రాయం అని భోలే చెప్పారు.

అమర్ దీప్ తో నాకు ఎలాంటి గొడవలు లేవు. బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లోకి అవకాశాలు ఉన్న వారిలో పల్లవి ప్రశాంత్ టాప్ స్థానంలో ఉంటాడు. రైతు బిడ్డగా కేవలం శారీరక బలమే కాదు .. బుద్ధి బలం కూడా ఉపయోగించడం చూసి ఇష్టపడ్డాను. శివాజీ కూడా టాప్ 5 లో ఉంటారు. ప్రిన్స్ యావర్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. అశ్విని శ్రీ అలాగే అమర్ దీప్ లేదా ప్రియాంక జైన్ గాని టాప్ 5 లో ఉండే అవకాశం ఉందని భోలే చెప్పుకొచ్చారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Oktelugu Epaper