Homeఎంటర్టైన్మెంట్Bhagyaraj Last Letter: కన్నీళ్లు రప్పిస్తున్న ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ చివరి లేఖ..

Bhagyaraj Last Letter: కన్నీళ్లు రప్పిస్తున్న ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ చివరి లేఖ..

Bhagyaraj Last Letter: తమిళనాడు లో లెజండరీ స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ నటుడు, రచయితా , దర్శకులు భాగ్య రాజ్ తన తుదిశ్వాస ని విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లో ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ముందు రోజు రాత్రి ఆయన ఎంతో ఉత్సాహం తో ప్రముఖ హీరోయిన్ కుష్బూ కూతురు అవంతిక వివాహానికి హాజరయ్యారు. అలాంటి వ్యక్తి పొద్దున్న లేచేలోపే చనిపోయారు అనే వార్త విని జీర్ణించుకోలేకపోయారు […]

Bhagyaraj Last Letter: తమిళనాడు లో లెజండరీ స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ నటుడు, రచయితా , దర్శకులు భాగ్య రాజ్ తన తుదిశ్వాస ని విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లో ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ముందు రోజు రాత్రి ఆయన ఎంతో ఉత్సాహం తో ప్రముఖ హీరోయిన్ కుష్బూ కూతురు అవంతిక వివాహానికి హాజరయ్యారు. అలాంటి వ్యక్తి పొద్దున్న లేచేలోపే చనిపోయారు అనే వార్త విని జీర్ణించుకోలేకపోయారు అభిమానులు , సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు. అయితే సోషల్ మీడియా లో భాగ్యరాజ్ కి సంబంధించిన చివరి లేఖ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఆ లేఖలో ఆయన మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. ముఖ్యంగా తన నేత్రాలను దానం చేసే విషయం పై , అదే విధంగా తన కొడుకు గురించి ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘మన చుట్టూ ఉన్నవాళ్లను సంతోషపెట్టడం లోనే మన నిజమైన ఆనందం దాగుంది. ఇనీళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణం లో అభిమానులు నాపై చూపించిన అపారమైన ప్రేమ , నన్ను ఎంతగానో ప్రోత్సహించిన అక్కాచెల్లెళ్లు , తల్లులకు , ఇండస్ట్రీ లోని నా సహచరులకు కృతఙ్ఞతలు. మీ ప్రేమని ఎల్లప్పుడూ చూడడం కోసం నా కళ్ళను సజీవంగా ఉంచాను , దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. నా కోసం మీరంతా కొట్టిన చప్పట్లు నా కొడుకుకి కూడా ఆశీర్వాదం గా మారాలని కోరుకుంటున్నాను. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణం లో మీరు నాపై చూపించిన ప్రేమ , ఆదరణ నా కొడుకు శాంతనుపైన కూడా చూపించాలి, నేను శారీరకంగా మీతో ఈరోజు లేకపోయినా నా కళ్ళ ద్వారా అభిమానులను చూస్తూనే ఉంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు , ఎదో ఒక రోజు భూమిలో కలిసిపోతుంది , లేదంటే అగ్నికి ఆహుతి అవుతుంది’.

‘చివరికి మిగిలేది బూడిదే , కానీ మనం పంచిన ప్రేమే అసలైన సంపద. నా జీవిత ప్రయాణం లో నన్ను ప్రేమించి , నా కష్టసుఖాల్లో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. నేను చేసిన మంచి సినిమాలు , కథలు , డైలాగ్స్, చూపించిన మానవత్వం ద్వారా చిరస్థాయిగా జీవిస్తాను ‘ అంటూ చెప్పుకుకొచ్చారు భాగ్యరాజ్. భాగ్యరాజ్ తెలుగు , తమిళ భాషలకు కలిపి దాదాపుగా 25 సినిమాలకు దర్శకత్వం వహించగా, 75 కి పైగా సినిమాల్లో నటించారు. ప్రముఖ హీరోయిన్ పూర్ణిమ ని ప్రేమించిన పెళ్లాడిన ఈయన , ఆ తర్వాత శాంతను కి జన్మనిచ్చారు. ప్రస్తుతం శాంతను తమిళం లో హీరోగా అనేక సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper