Homeఎంటర్టైన్మెంట్Bellamkonda Sai Srinivas Wedding: భర్త బెల్లంకొండ శ్రీనివాస్ పై ముద్దుల వర్షం కురిపించిన సతీమణి...

Bellamkonda Sai Srinivas Wedding: భర్త బెల్లంకొండ శ్రీనివాస్ పై ముద్దుల వర్షం కురిపించిన సతీమణి కావ్య.. వీడియో వైరల్..

Bellamkonda Sai Srinivas Wedding: ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫోటోలు , వీడియోలే కనిపిస్తున్నాయి. రీసెంట్ గానే తిరుమల లో శ్రీవారి సన్నిధిలో వీళ్లిద్దరు మూడు మూళ్ళ తో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఈమధ్య కాలంలో ప్రతీ సినీ సెలబ్రిటీ డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ పర రాష్ట్రం భారీ హంగులు ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా మన రాష్ట్రంలో , అది కూడా తిరుమల లాంటి […]

Bellamkonda Sai Srinivas Wedding: ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫోటోలు , వీడియోలే కనిపిస్తున్నాయి. రీసెంట్ గానే తిరుమల లో శ్రీవారి సన్నిధిలో వీళ్లిద్దరు మూడు మూళ్ళ తో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఈమధ్య కాలంలో ప్రతీ సినీ సెలబ్రిటీ డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ పర రాష్ట్రం భారీ హంగులు ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా మన రాష్ట్రంలో , అది కూడా తిరుమల లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రం లో పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీలు చాలా తక్కువ మంది ఉన్నారు, ఆ తక్కువ మందిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య జంట ఉండడం గమనార్హం. అంతే కాదు , ఈ జంట తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ, అన్నీ పద్దతి ప్రకారమే పెళ్లి కార్యక్రమాలు జరుపుకున్నారు. ఇది కచ్చితంగా అభినందించదగ్గ విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత , పేర్లు చెప్పి లోపలకు అడుగుపెట్టడం అనేది మన సంప్రదాయం. దీనిని కూడా పాటించారు ఈ జంట, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో లో బెల్లం కొండ తన సతీమణి కావ్య ని ఆటపట్టించిన తీరుని చూస్తే చాలా క్యూట్ గా అనిపించింది. ఇక నిన్న ఇన్ స్టాగ్రామ్ లో తన పెళ్లి ఫోటోలను అప్లోడ్ చేస్తూ ‘నా భార్య నిప్పు రా’ అంటూ లేటెస్ట్ ట్రెండ్ డైలాగ్ ని క్యాప్షన్ గా పెట్టి, బెల్లంకొండ జెన్ జీ ఆడియన్స్ ని అలరించాడు. ఇక సతీమణి కావ్య అయితే బెల్లంకొండ పై ముద్దుల వర్షం కురిపించడం , ఆ తర్వాత బుగ్గకి అంటుకున్న లిప్ స్టిక్ ని తన చేతులతో తుడవడం వంటి క్యూట్ మూమెంట్స్ అభిమానులను ఆకట్టుకుంది.

చూస్తుంటే ఈ జంట మధ్య రిలేషన్ పెళ్ళికి ముందు నుండే పీక్ రేంజ్ లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. తన అక్క ద్వారా పరిచయమైనా కావ్య తో గత ఆరేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు బెల్లంకొండ. హైదరాబాద్ వీధుల్లో ఈమెతో కలిసి కారులో తిరుగుతున్నప్పుడు , ఎవరు ఈ అమ్మాయి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది ఫోటోలు తీసి అప్లోడ్ కూడా చేశారు అప్పట్లో. అలా ఎంతో కాలం డేటింగ్ చేసిన తర్వాత పెద్దల ఇష్టప్రకారం గ్రాండ్ గా వీళ్లిద్దరి వివాహం జరిగింది. కావ్య బెల్లంకొండ జీవితం లోకి వైవాహిక బంధం ద్వారా అడుగుపెట్టిన తర్వాత , ఆయన కెరీర్ ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో చూడాలి.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper