Homeఎంటర్టైన్మెంట్Bellamkonda Srinivas wedding : 'నా పెళ్ళాం నిప్పురా' అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ సెన్సేషనల్ పోస్ట్...

Bellamkonda Srinivas wedding : ‘నా పెళ్ళాం నిప్పురా’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ సెన్సేషనల్ పోస్ట్ వైరల్..

Bellamkonda Srinivas wedding : ఏప్రిల్ 29 న టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తిరుమల పుణ్యక్షేత్రంలో కావ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్ళికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వంటి వారు తప్ప, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరు అవ్వలేదు. కానీ నిన్న రాత్రి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన వెడ్డింగ్ రిసెప్షన్ కి మాత్రం టాలీవుడ్ సినీ పరిశ్రమకు […]

Bellamkonda Srinivas wedding : ఏప్రిల్ 29 న టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తిరుమల పుణ్యక్షేత్రంలో కావ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్ళికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వంటి వారు తప్ప, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరు అవ్వలేదు. కానీ నిన్న రాత్రి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన వెడ్డింగ్ రిసెప్షన్ కి మాత్రం టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ , మంచు మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, ఇలా సినీ ప్రముఖులంతా ఒక్క చోట తళుక్కుమని మెరిశారు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు నేను నా జీవితంలో కనుగొన్న వాటికంటే గొప్ప నిధిని కనుగొన్నాను. ఆ నిధిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను’ అంటూ తన భార్యని వర్ణిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా ఈమధ్య కాలంలో బెల్లంకొండ శ్రీనివాస్ పాత చిత్రం ‘జయ జానకి నాయకా ‘ చిత్రం లోని ‘నీ కూతురు నిప్పురా’ అనే డైలాగ్ ఇన్ స్టాగ్రామ్ లో ఒక రేంజ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానిని మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ రీ క్రియేట్ చేస్తూ, ‘నా భార్య నిప్పురా’ అనే క్యాప్షన్ తో ఒక పోస్ట్ పెట్టడం హైలైట్ గా నిల్చింది. ఈ పోస్ట్ క్రింద కామెంట్స్ లో కొంతమంది నెటిజెన్స్ ‘బ్రదర్ నిప్పు తో జాగ్రత్త, గేమ్ ఆడొద్దు , ఈమధ్య కాలం లో ఈ నిప్పు కాపురాల్లో చిచ్చు పెడుతోంది’ అంటూ ఫన్నీ గా చెప్పుకొస్తున్నారు.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ విషయానికి వస్తే, నిర్మాత కొడుకుగా అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ‘అల్లుడు అదుర్స్’ చిత్రం తర్వాత కాస్త టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ లోకి ఛత్రపతి రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ టాలీవుడ్ లోకి ‘భైరవం’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. కానీ ఆ తర్వాత విడుదలైన ‘కిష్కిందపురి’ చిత్రం మాత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. భవిష్యత్తులో కూడా మంచి లైనప్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper