Homeఎంటర్టైన్మెంట్Sonu Sood Before Movies: సినిమాల్లోకి రాకముందు పాపం సోనూసూద్ అలాంటి పనులు చేసేవాడా.. చివరికి...

Sonu Sood Before Movies: సినిమాల్లోకి రాకముందు పాపం సోనూసూద్ అలాంటి పనులు చేసేవాడా.. చివరికి ట్రైన్ లో అలా..

Sonu Sood Before Movies: సినీ ఇండస్ట్రీ లో నేడు పెద్ద స్టార్స్ గా కనిపిస్తున్న ఎంతో మంది నటీనటులకు ఆ లగ్జరీ జీవితం అంత తేలికగా రాలేదు అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంత పెద్ద సినీ స్టార్ వారసుడు అయినా కష్టపడి టాలెంట్ నిరూపించుకుంటూనే ఈ ఇండస్ట్రీ లో కొనసాగగలరు. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్స్ వారసులుగా వచ్చిన వాళ్ళ పరిస్థితే అలా ఉంది, ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ […]

Sonu Sood Before Movies: సినీ ఇండస్ట్రీ లో నేడు పెద్ద స్టార్స్ గా కనిపిస్తున్న ఎంతో మంది నటీనటులకు ఆ లగ్జరీ జీవితం అంత తేలికగా రాలేదు అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంత పెద్ద సినీ స్టార్ వారసుడు అయినా కష్టపడి టాలెంట్ నిరూపించుకుంటూనే ఈ ఇండస్ట్రీ లో కొనసాగగలరు. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్స్ వారసులుగా వచ్చిన వాళ్ళ పరిస్థితే అలా ఉంది, ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , నేడు తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న కొంతమంది స్టార్స్ , సినిమాల్లోకి రాకముందు ఎలాంటి పరిస్థితులను ఎదురుకొని ఉండుంటారో మీరే ఊహించుకోండి. నేడు అలాంటి పరిస్థితులను ఎదురుకున్న సోనూసూద్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. హీరో అవుదామని ఇండస్ట్రీ లోకి వచ్చాడు , కానీ పరిస్థితులు అతన్ని వెండితెర పై విలన్ గా మార్చాయి.

కానీ కష్టసమయంలో జనాలకు అండగా నిలిచి , నిజ జీవితం లో హీరో గా నిలిచాడు సోనూ సూద్. ఆ విధంగా ఆయన హీరో అవ్వాలనే కథ ని నిజం చేసుకున్నాడు. అయితే సినిమాల్లోకి రాక ముందు ఆయన పడిన కష్టాలు ఎలాంటివో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు సోనూసూద్. అవి విన్న తర్వాత ఒక్క పైసా సంపాదించాలంటే, ఇంత కష్టపడాలా ? అనేది నేటి యువతకు అర్థం అవుతుంది. రీసెంట్ గానే ఆయన వందే భారత్ ట్రైన్ లో ప్రయాణించాడు. దీని అనుభవాన్ని ఆయన పంచుకుంటూ , ఆరోజుల్లో రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఒకప్పుడు ట్రైన్ రిజర్వేషన్లు లేక, రైళ్లలో న్యూస్ పేపర్లు పరుచుకొని పడుకునేవాడిని. అలాంటిది నేడు రైలు సౌకర్యం ఈ స్థాయిలోకి వస్తుందని ఊహించలేదు. నేడు వండేభారత్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నాను, ఇందులో నాణ్యమైన ఆహరం , అద్భుతమైన సిబ్బంది సేవలు ఉన్నాయి. సామాన్య భారతీయుల ప్రయాణ నాణ్యతని పెంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు సోనూ సూద్.

ఒకప్పుడు రిజర్వేషన్లు దొరకక, సోనూసూద్ ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకున్నాడు అంటే, ఆయన ఆర్ధిక పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మనం ట్రైన్ టిక్కెట్స్ దొరక్కపోతే బస్సులో టిక్కెట్ బుక్ చేసుకొని వెళ్తాము, కానీ సోనూ సూద్ అదే ట్రైన్ లో పేపర్లు పడుకొని వెళ్ళేవాడంటేనే అర్థం చేసుకోవచ్చు , ఆయన ఆర్ధిక స్తొమత ఎలాంటిది అనేది. అంతే కాదు , హోటల్స్ లో వెయిటర్ గా కూడా అప్పట్లో సోనూ సూద్ పని చేసేవాడట. అలా ఎన్నో కష్టాలు అనుభవించి , మొదటి సినిమాలో విలన్ గా నటించే రేంజ్ కి ఎదిగేందుకు సోనూ సూద్ కి పదేళ్లకు పైగానే సమయం పట్టిందట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper