Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టులో రీసెంట్ గానే తీర్పు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ బండ్ల గణేష్ సుప్రీంకోర్టుని ఆశ్రయించి పిటీషన్ వేశారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు , బండ్ల గణేష్ వేసిన పిటీషన్ ని కొట్టిపారేసింది. సోషల్ […]

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టులో రీసెంట్ గానే తీర్పు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ బండ్ల గణేష్ సుప్రీంకోర్టుని ఆశ్రయించి పిటీషన్ వేశారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు , బండ్ల గణేష్ వేసిన పిటీషన్ ని కొట్టిపారేసింది. సోషల్ మీడియా లో గత కొద్దిరోజుల నుండి హాట్ టాపిక్ గా మారిన ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే , గతం లో బండ్ల గణేష్ యూనియన్ బ్యాంక్ నుండి రుణం తీసుకున్నారు. సకాలం లో ఆయన డబ్బులు చెల్లించకపోవడం , ఆయన తాకట్టులో పెట్టిన స్థిరాస్తిని వేలం వేయడానికి యూనియన్ బ్యాంక్ సిద్ధమైంది.

దీంతో బండ్ల గణేష్ హైకోర్టును ఆశ్రయించారు. యూనియన్ బ్యాంక్ చేపట్టిన వేలం సరైనదే అని, న్యాయబద్ధంగానే వాళ్ళు వెళ్తున్నారని , ఈ వ్యవహారం లో జోక్యం చేసుకోలేము అంటూ తెలంగాణ హైకోర్టు యూనియన్ బ్యాంక్ ని సమర్థిస్తూ తీర్పుని ఇచ్చింది. దీనిపై బండ్ల గణేష్ సుప్రీం కోర్టులో పిటీషన్ వేసి పోరాటం చెయ్యాలని అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయనకు నేడు చుక్కెదురు అయ్యింది. ఇప్పుడు బండ్ల గణేష్ తన స్థిరాస్తిని వేలం వేయకుండా ఎలా కాపాడుకుంటాడో చూడాలి. స్వయంగా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవచ్చు. కానీ ఇది ముందే చేసి ఉండాలి , ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లడం తో బ్యాంక్ ఎలా రెస్పాన్స్ ఇస్తుందో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క బండ్ల గణేష్ కూతురు జనని పెళ్లి వచ్చే నెల 16 వ తేదీన జరగబోతుంది.

రీసెంట్ గానే గ్రాండ్ గా నిశ్చితార్ధ కార్యక్రమాలు కూడా చేశారు బండ్ల గణేష్. అంతే కాకుండా తాను ఆరాధ్య దైవం గా భావించే పవన్ కళ్యాణ్ ని కుటుంబ సమేతంగా కలిసి పెళ్ళికి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతా సాఫీగా జరిగిపోతుందని అనుకుంటున్న సమయం లో ఇలాంటి పరిస్థితి ఎదురు అవ్వడం ఆయనకు గట్టి దెబ్బ నే అని చెప్పొచ్చు. మరి ఈ అంశం పై బండ్ల గణేష్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper