Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu: చంద్రబాబు అంటే అలానే ఉంటుంది.. వైసిపి కోరుకున్నట్టుగా కాదు.. ఏపీలో పోలింగ్ జరిగేది...

Chandrababu Naidu: చంద్రబాబు అంటే అలానే ఉంటుంది.. వైసిపి కోరుకున్నట్టుగా కాదు.. ఏపీలో పోలింగ్ జరిగేది అప్పుడే..

Chandrababu Naidu: ఏపీ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు ఆగిపోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి. విధ్వంసం దర్జాగా సాగాలి. రోడ్లు వేయకూడదు. నిర్మించిన రోడ్లను ధ్వంసం చేయాలి. ప్రజల మీదికి వాహనాలను తోలాలి. అడ్డువచ్చిన వాళ్లను లేపేయాలి.. ఇదే వైసీపీ సూత్రం. కొద్దిరోజులుగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి.. ఏపీ రాష్ట్రంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది వైసిపి. పైగా స్థానిక ఎన్నికల మీద సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇచ్చిన […]

Chandrababu Naidu: ఏపీ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు ఆగిపోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి. విధ్వంసం దర్జాగా సాగాలి. రోడ్లు వేయకూడదు. నిర్మించిన రోడ్లను ధ్వంసం చేయాలి. ప్రజల మీదికి వాహనాలను తోలాలి. అడ్డువచ్చిన వాళ్లను లేపేయాలి.. ఇదే వైసీపీ సూత్రం. కొద్దిరోజులుగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి.. ఏపీ రాష్ట్రంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది వైసిపి. పైగా స్థానిక ఎన్నికల మీద సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక విధంగా ఉంటే.. తనకు అనుకూలంగా మార్చుకొని.. సొంత మీడియాలో డబ్బాలు కొట్టుకుంటుంది.

వాస్తవానికి వైసీపీ కోరుకున్నట్టుగా ఏపీలో జరగడం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయనకు ఎప్పుడు రాజకీయం చేయాలి.. ఎప్పుడు ఎలాంటి అడుగులు వేయాలి.. అన్నీ తెలుసు. 40 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తికి ఎన్నికలు కొత్త కాదు కదా. ఇటువంటి స్థానిక ఎన్నికలు ఆయనకు పెద్ద లెక్కలోది కాదు కదా. అందువల్లే తన చాణక్యాన్ని.. చాకచక్యాన్ని మొదలుపెట్టారు. వైసీపీకి నోరు తిప్పుకోలేని పరిస్థితిని కల్పించారు.

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. నామినేషన్ల విషయంలో అడ్డంకులు.. బలవంతంగా ఏకగ్రీవాలు జరిగాయని వైసిపి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సమస్యలు ఉన్న ప్రాంతాలలో 48 గంటల పాటు నామినేషన్ల ప్రక్రియను పునరుద్ధరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికిల సంఘం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా పక్కన పెట్టింది.

తుది అభ్యర్థుల జాబితా ప్రచురణ ను అక్టోబర్ 25 వరకు నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా పాత షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియను కొనసాగించడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎన్నికల క్యాలెండర్ ను పునర్వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వైసీపీ ప్రస్తావించిన 19 సమస్యాత్మక మున్సిపాలిటీలతో పాటు ఏకగ్రీవాలు నమోదైన వార్డులలోనూ పరిశీలన చేయాల్సి ఉంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎక్కడైనా అడ్డంకులు ఎదుర్కొన్నారా.. అనే అంశాలను కూడా పరిశీలించాలి. ఈ నేపథ్యంలో కలెక్టర్లు.. ఎస్పీలు.. రిటర్నింగ్ అధికారులు సమర్పించే నివేదికలు.. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి నామినేషన్ల స్వీకరణను తిరిగి ప్రారంభించాల్సిన ప్రాంతాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. సమస్య ఉండే ప్రాంతాలలో 48 గంటల పాటు నామినేషన్లకు అవకాశం కల్పిస్తే.. అనంతరం నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ.. తుది అభ్యర్థుల జాబితా ప్రచురణ వంటి ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ను అక్టోబర్ 28న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ.. తాజా పరిణామాలతో ఆ తేదీన పోలింగ్ నిర్వహించడం కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నామినేషన్ల ప్రక్రియను తిరిగి నిర్వహించాల్సి రావటం.. అనంతరం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా తదుపరి దశలను పూర్తి చేయాల్సి ఉండడంతో పోలింగ్ తేదీలలో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు తగిన సమయం కేటాయించాల్సి ఉండడంతో పోలింగ్ తేదీని అక్టోబర్ చివరి వారం కాకుండా నవంబర్ ఒకటవ తేదీకి మార్చే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఇప్పటికే నవంబర్ మూడున ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. ఆ ఎన్నికలకు ముందుగానే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే విధంగా కొత్త షెడ్యూల్ రూపొందించే అంశంపై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ఆమలు.. న్యాయ నిపుణుల సలహాలు.. జిల్లాల నుంచి అందే నివేదికల ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం తీసుకోబోతోంది. పోలింగ్ తేదీ మార్పు.. సవరించిన ఎన్నికల షెడ్యూల్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని వైసీపీ కోరుకుంటే.. చంద్రబాబు మాత్రం మరో విధంగా అడుగులు వేశారు. ఫలితంగా వైసిపికి గుక్క తిప్పుకొని పరిస్థితిని కల్పించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper