Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: చివరికి సుప్రీంకోర్టును కూడా.. వైసిపి నేతలు ఇంకెంతకు దిగజారుతారు

YSRCP: చివరికి సుప్రీంకోర్టును కూడా.. వైసిపి నేతలు ఇంకెంతకు దిగజారుతారు

YSRCP: ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మీద వైసిపి విషం చిమ్ముతూనే ఉంది. చివరికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వక్రీకరణలు చేస్తూ.. విష ప్రచారానికి తరలింపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల గడువును సుప్రీంకోర్టు నేరుగా పొడిగించిందని.. ప్రభుత్వం మీద తామే అప్పర్ హ్యాండ్ సాధించామని వైసిపి నాయకులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హంగామా చూస్తే.. గోబెల్స్ ప్రచారం కూడా చిన్న పోతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశాన్ని […]

YSRCP: ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మీద వైసిపి విషం చిమ్ముతూనే ఉంది. చివరికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వక్రీకరణలు చేస్తూ.. విష ప్రచారానికి తరలింపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల గడువును సుప్రీంకోర్టు నేరుగా పొడిగించిందని.. ప్రభుత్వం మీద తామే అప్పర్ హ్యాండ్ సాధించామని వైసిపి నాయకులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హంగామా చూస్తే.. గోబెల్స్ ప్రచారం కూడా చిన్న పోతుంది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశాన్ని కనీసం చదివే వాళ్ళు వైసీపీలో లేరా అనే అనుమానం కలుగుతోంది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. పిటిషనర్లు కోరుకున్న విధంగా న్యాయస్థానం ఎక్కడ కూడా బ్లాంకెట్ ఆర్డర్ ద్వారా నామినేషన్ గడుగు పొడిగించలేదు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణ బాధ్యత మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్ణయాధికారాలను కమిషన్ కు ఇచ్చేసింది.

సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతంలో పరిస్థితులను అంచనా వేస్తూ.. అక్కడ నామినేషన్ల గడువు పొడగించాలా? లేదా? అనే విషయాల మీద నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గడువు పెంచాలి అని వైసిపి విజ్ఞప్తి చేసినప్పటికీ.. దానిని సుప్రీంకోర్టు లెక్కలోకి తీసుకోలేదు. కేవలం వచ్చిన ఆధారాల ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని కమిషన్ కు సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికలకు సంబంధించి తుది అభ్యర్థుల జాబితా ప్రచురణను ఈనెల 25 వరకు వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, కమిషన్ తీసుకునే చర్యలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ న్యాయపక్రియలో దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసిన కొన్ని ప్రాథమిక పరిశీలనలో రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచాయి. అయితే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో స్వేచ్ఛగా జరిగే ఎన్నికలు ఒక భాగం. శాంతిభద్రతల సమస్యలు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నప్పుడు తాము మౌనంగా ఉండలేమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇదే సమయంలో పిటిషనర్ సమర్పించిన వీడియో క్లిప్పింగ్లను.. అఫిడవిట్లలో ఉన్న ప్రాథమిక ఆధారాలను ప్రస్తావిస్తూ.. నామినేషన్ దాఖలును అడ్డుకున్నారనే ఆరోపణలను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తద్వారా స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి తాము కృత నిశ్చయంతో ఉన్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు ఇలా ఉంటే వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం మరో విధంగా ఉంది. నేరుగా నామినేషన్ల గడువు పొడిగింపు ఆర్డర్ సుప్రీంకోర్టు ఇవ్వలేదు. ఎన్నికల సంఘం సమగ్ర పరిశీలన జరిపి.. ఒక నిర్ణయం తీసుకోవాలని చేసిన ఆదేశం మాత్రమే . ఒకవేళ హింస జరిగిందని భావిస్తున్న ప్రాంతంలో 48 గంటల సమయం సేవకాశాన్ని ఎన్నికల కమిషన్ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చైత్ర స్థాయిలో నివేదికలు తెప్పించుకొని.. పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం వెలుబడుతుంది. దీనిపై ఎన్నికల కమిషన్ ఇచ్చే నివేదిక ప్రకారం ఈనెల 27న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper