Homeఎంటర్టైన్మెంట్సినీ లోకం స్తంభించినా బాలయ్య మాత్రం తగట్లేదుగా ! 

సినీ లోకం స్తంభించినా బాలయ్య మాత్రం తగట్లేదుగా ! 

టాలీవుడ్ లో ఇప్పుడు కరోనా అనంతరం అనే మాటను తరుచుగా వాడుతున్నారు. మరి ఆ అనంతరం ఇప్పట్లో ఉండేలా కనబటం లేదు. చిత్రనిర్మాతలు తమ షూటింగులను తిరిగి ప్రారంభించడానికే భయపడే పరిస్థితి. ఇప్పటికే చాలా మంది చిత్రనిర్మాతలు ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌లను రద్దు చేస్తుకున్నారు.  అయితే  బాలయ్య – బోయపాటి సినిమా ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను అక్టోబర్ మొదటి వీక్ నుండి ప్లాన్ చేస్తున్నారు. […]

Balayya boyapati movie
టాలీవుడ్ లో ఇప్పుడు కరోనా అనంతరం అనే మాటను తరుచుగా వాడుతున్నారు. మరి ఆ అనంతరం ఇప్పట్లో ఉండేలా కనబటం లేదు. చిత్రనిర్మాతలు తమ షూటింగులను తిరిగి ప్రారంభించడానికే భయపడే పరిస్థితి. ఇప్పటికే చాలా మంది చిత్రనిర్మాతలు ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌లను రద్దు చేస్తుకున్నారు.  అయితే  బాలయ్య – బోయపాటి సినిమా ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను అక్టోబర్ మొదటి వీక్ నుండి ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి ఈ సీక్వెన్స్ ను  వారణాసి మరియు హిమాలయాలలో విస్తృతంగా షూట్ చేయాలి. అయితే అది సాధ్యం కాదు. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి ఈ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. కథకు చాలా కీలకమైన ఈ సీన్స్ లో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. ఇక స్టూడియోలో సెట్ వేయడం స్టార్ట్ చేశారు. మొత్తానికి కరోనా టైంలో కూడా బాలయ్య బృందం షూట్ చేయడానికి సిద్ధం అవ్వడం విశేషమే.
ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కానీ ఆ హీరోయిన్ యాక్టింగ్ బాగాలేదట. అందుకే అంజలిని హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఇక చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.  బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించినా ఇప్పుడు చేస్తోన్న సినిమా పై పెద్దగా అంచనాలు లేవు.
ఏమైనా కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం మొత్తం  స్తంభించిపోయినా బాలయ్య మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ముందుకుపోతున్నాడు.
admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper