
రాజకీయాల్లో సెంటిమెంట్, సానుభూతి అస్త్రాలకు తిరుగులేదనే చెప్పొచ్చు. ఈ అస్త్రాలను ఉపయోగించే తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీలు ఏకంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగాయి. ప్రజల్లోకి సెంటిమెంట్, సానుభూతిని బలంగా తీసుకెళ్లడం ద్వారా ఎన్నో పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగాయి. ఇటీవల కాలంలోనూ తెలంగాణ సెంటిమ్మెంట్ తో టీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. ‘ఒక్కఛాన్స్’ అనే సానుభూతిని జగన్ ప్రజల్లోకి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఈ అస్త్రాలను సరైన పద్దతిలో ఉపయోగించుకుంటే నూటికి నూరుళ్లుపాళ్లు విజయం సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మచిలిపట్నంలోనూ ఇప్పడు సానుభూతి రాజకీయాలు నడుస్తున్నాయి. మచిలిపట్నంలో టీడీపీ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి కోల్లు రవీంద్ర, వైసీపీ నుంచి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని పోటీ చేశారు. వీరిలో పేర్ని నాని విజయం సాధించి జగన్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. పేర్ని నాని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రిగా పని చేస్తున్నాయి. అయితే ఇటీవల కొల్లు రవీంద్ర ఓ కేసులో జైలుపావడంతో ఇక జిల్లాలో నానికి తిరుగులేకుండా పోతుందని అందరూ భావించారు. అయితే ఆయన హవా పెరగాల్సిందిపోయి విచిత్రంగా తగ్గముఖం పడుతుందనే టాక్ విన్పిస్తోంది.
బీసీ వర్గానికి చెందిన కొల్లు రవీంద్రను వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో అరెస్టు చేసిందని టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోన్నాయి. కొల్లురవీంద్రకు అనుకూలంగా మీడియాలో రోజుకో కథనం ప్రసారం చేస్తుండటంతో ఆయనపై ప్రజల్లోకి సింపతి పెరిగిపోతుంది. నియోజకవర్గంలో ఎక్కువున్న మత్స్య సామాజికవర్గాల్లో కొల్లు రవీంద్రకు సానుభూతి పెరిగిపోతుందట. కొల్లు రవీంద్రకు అనుకూలంగా ప్రజలు రోడ్లపైకి రావడంతో మంత్రి పేర్ని నానిలో టెన్షన్ మొదలైంది. కొల్లు రవీంద్ర అరెస్టులో రాజకీయ కక్ష లేదని వివరించడంలో నాని విఫలమయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ప్రజల్లో సానుభూతి పెరుగుతుందనే వాదనలు విన్పిస్తున్నాయి.
బీసీ వర్గాల్లో కొల్లు రవీంద్రకు సింపతి పెరుగుతుండగా పేర్ని నానికి వ్యతిరేకంగా మారుతున్నాయి. ఇక పేర్ని నాని కాపు వర్గానికి చెందిన నేత. ఇక్కడ జనసేన బలంగా ఉండటంతో కాపులు నేతలంతా జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కాపు ఓట్లు చిలీపోయే ప్రమాదం ఉండటంతో పేర్ని నానిలో టెన్షన్ మొదలైంది. ఈ సానుభూతి కొల్లు రవీంద్రపై ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో మంత్రి పేర్ని నానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో టీడీపీకి నేతలకు వస్తున్న సానుభూతిని మంత్రి పేర్ని నాని ఎలా బ్రేక్ చేస్తారో వేచి చూడాల్సిందే..!