Balagam Venu: కమెడియన్ గా తనకంటూ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్న వేణు, ‘బలగం’ చిత్రం తో డైరెక్టర్ గా మారి, భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని, అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాడు. ఇన్ని రోజులు మనం చూస్తూ పెరిగిన వేణు లో ఇంతటి దర్శకత్వ ప్రతిభ ఉందా?, ఇంతటి రైటింగ్ టాలెంట్ ఉందా?, సాధారణమైన వాడు కాదు కదా అంటూ మూవీ లవర్స్ మొత్తం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇప్పుడు వేణు ‘ఎల్లమ్మ’ అనే భారీ బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరో గా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
వేణు కసి చూస్తుంటే ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ షేక్ చేసే పెట్టేలా ఉన్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ‘బలగం’ చిత్రానికి ఎలాంటి ఖర్చు లేకుండా, చాలా సింపుల్ గా నిర్మించిన దిల్ రాజు, ఎల్లమ్మ కి భారీ రేంజ్ లోనే ఖర్చు చేయబోతున్నాడట.ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ వేణు ఇన్ స్టాగ్రామ్ లో రీసెంట్ గా అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వివాదాస్పదం గా మారింది. తెలంగాణ లోని ఒక ఆలయం లో వేణు స్టైల్ గా గోడ మీద కూర్చొని కొన్ని ఫోటోలు దిగాడు. ఆయన కాళ్లకు షూస్ ధరించి ఉన్నాయి. షూ వేసుకొని గుడిలోకి రావడం అపచారం, మహా పాపం , వేణు అలా ఎందుకు వచ్చాడు?, గొప్ప గొప్ప డైలాగ్స్ రాసే వేణుకి ఈ చిన్న విషయం కూడా తెలియదా?, లేదా తెలిసి కూడా కావాలని అహంకారంతో ఇలా చేశాడా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
మరోపక్క వేణు కి సపోర్ట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. వేణు ఆలయంలో అలా షూస్ వేసుకుని కూర్చోలేదని, మనకి కనిపిస్తున్న ఫోటోలు ఆలయం లోని కావని, అక్కడ ఎదురు ఉన్నా ఒక ఇంటిలోని ఫోటోలని అంటున్నారు. అంతే కాకుండా సినిమా షూటింగ్ చేస్తున్నాడు కాబట్టి, కరెంటు వైర్లు మెండుగా ఉంటాయి. ఏ క్షణం లో కరెంటు షాక్ కొట్టే అవకాశం ఉండడం వల్లే వేణు అలా షూ ధరించాడు అని కూడా అంటున్నారు . మరి ఈ వివాదం పై ఆయన స్పందిస్తాడో లేదో చూడాలి.
View this post on Instagram