Balagam Venu: ఈటీవీ లో గత 12 ఏళ్ళ నుండి ప్రసారం అవుతున్న ‘జబర్దస్త్’ అనే కామెడీ షో, ఎంత మంది కమెడియన్స్ కి సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, మహేష్, చమ్మక్ చంద్ర, ఇలా ఎంతో మంది కమెడియన్స్ నేడు ఇండస్ట్రీ లో టాప్ స్థానం లో కొనసాగుతున్నారు. ఇక ఈ షోకి యాంకర్ గా పని చేసిన అనసూయ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోయింది. అలా ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన బిగ్గెస్ట్ కామెడీ షో ఇది. ఈ షో ద్వారా దాదాపుగా అందరూ కొత్తవాళ్ళనే పరిచయం చేసింది మల్లెమాల సంస్థ. కానీ వేణు, ధనరాజ్ వంటి ఇండస్ట్రీ లో బాగా స్థిరపడిన కమెడియన్స్ ని కూడా మంచి పారితోషికం ఇచ్చి తీసుకోవాల్సి వచ్చింది.
వేణు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం. కమెడియన్ గా మొదలై, నేడు డైరెక్టర్ గా మారి, ‘బలగం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తీసి , ఇప్పుడు ఎల్లమ్మ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రానికి దర్శకత్వం వహించే రేంజ్ కి ఎదిగాడు. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లొచ్చు. అయితే వేణు జబర్దస్త్ లోకి రాకముందే సినీ ఇండస్ట్రీ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్. కానీ మల్లెమాల టీం మంచి ప్యాకేజ్ ఇవ్వడం తో కాదు అనలేక ఒప్పుకొని ఈ షో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ లో టాప్ స్థానం లో కొనసాగుతున్న సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ని తన స్కిట్స్ ద్వారా జనాలకు పరిచయం చేసింది వేణు నే. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే జబర్దస్త్ గురించి వేణు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘జబర్దస్త్ లోకి రాకముందే నేను సినిమాల్లో ఫుల్ బిజీ గా ఉండేవాడిని . జబర్దస్త్ లో అవకాశం రాగానే కేవలం నాలుగైదు ఎపిసోడ్స్ మాత్రమే అనుకొని ఒప్పుకున్నాను. కానీ 13 ఎపిసోడ్స్ అన్నారు. ఆర్థికంగా నాకు జబర్దస్త్ చాలా మేలు చేసింది, కానీ నా ద్రుష్టి మొత్తం సినిమాల వైపే ఉండేది. కానీ టీవీ లో కనిపించడం వల్ల నాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే నాకు ‘జబర్దస్త్’ ని వదలడం ఇష్టం లేకపోయినా, సినీ కెరీర్ కోసం బలవంతంగానే వదులుకొని బయటకు రావాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు వేణు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.