Yellamma Glimpse : బలగం లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తెరకెక్కించిన వేణు(Venu Yeldandi) తన తదుపరి చిత్రం గా ‘ఎల్లమ్మ’ ని ప్రకటించి చాలా కాలం అయ్యింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ముందుగా ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని తో చెయ్యాలని అనుకున్నారు, కానీ ఎందుకో అది సెట్ అవ్వలేదు. ఆ తర్వాత యంగ్ హీరో నితిన్ తో చేద్దామని అనుకున్నారు. అయితే దిల్ రాజు అంతకు ముందు నితిన్ తో ‘తమ్ముడు’ అనే చిత్రం చేసాడు. అసలు వరుస ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కి, ఈ చిత్రం ద్వారా మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తగిలినట్టు అయ్యింది. దీంతో అతని మార్కెట్ పూర్తిగా చెడిపోవడం, పైగా ఎల్లమ్మ పెద్ద బడ్జెట్ మూవీ కావడంతో , నితిన్ తో ఈ సినిమా చేస్తే వర్కౌట్ అవ్వదు అని ఆయన్ని ఆ చిత్రం నుండి తప్పించేశారు.
దీంతో ఈ చిత్రం లో హీరో గా ఎవరు నటిస్తారు? అని అందరూ అనుకుంటున్న సమయం లో తమిళ హీరో కార్తీ నటిస్తాడు అనే రూమర్ వచ్చింది. కానీ చివరికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఈ చిత్రం ద్వారా హీరో గా వెండితెర కి పరిచయం కాబోతున్నాడని దిల్ రాజు అధికారిక ప్రకటన చేశారు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. ఈ చిత్రం లో కేవలం హీరో గా మాత్రమే కాదు, సంగీత దర్శకుడిగా కూడా దేవిశ్రీ నే వ్యవహరిస్తున్నాడు. పూనకాలు రప్పించే రేంజ్ లో ఈ గ్లింప్స్ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటని గమనించొచ్చు. తెలంగాణ సంస్కృతి కి అద్దం పట్టేలా ఈ సినిమా కూడా ఉండబోతుంది అట. ఇక గ్లింప్స్ చివర్లో దేవిశ్రీ ప్రసాద్ లుక్ ని చూసి నెటిజెన్స్ థ్రిల్ ఫీల్ అయ్యారు.
ఇన్ని రోజులు సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ మొట్టమొదటిసారి వెండితెర పై హీరో గా, ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తో పరిచయం కాబోతుండడం నిజంగా ఆయనకు అదృష్టం అనే చెప్పాలి. ఈ సినిమాని కేవలం తెలుగు భాషలో మాత్రమే కాదు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ హీరో గా లాంచ్ అవ్వాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇన్ని రోజులు కుదర్లేదు. కానీ ఇప్పుడు సరైన సినిమాతో ఆయన వెండితెర అరంగేట్రం చేయబోతున్నాడని, కచ్చితంగా ఈ సినిమా తర్వాత దేవిశ్రీ ప్రసాద్ హీరో గా స్థిరపడిపోవచ్చని అంటున్నారు నెటిజెన్స్. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ గా గాయకుడిగా కనిపించబోతున్నాడు. ఆయన మేడలో దోలు వేసుకున్న షాట్ ని కూడా మనం ఈ గ్లింప్స్ వీడియో లో గమనించొచ్చు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.