Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi: బాలయ్యతో చేసి రిస్క్ లో పడుతున్నాడు !

Anil Ravipudi: బాలయ్యతో చేసి రిస్క్ లో పడుతున్నాడు !

Anil Ravipudi: నట సింహం బాలయ్య బాబుతో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక సినిమా చేయబోతున్నాడు. అనిల్ కి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ముఖ్యంగా హీరో ఎవరైనా తనదైన కామెడీని పెట్టి సినిమాని హిట్ చేస్తాడు. కాకపోతే.. బాలయ్య మీద కామెడీ ఏ రకంగానూ వర్కౌట్ అవ్వదు అనేది ఇండస్ట్రీలో ఉన్న టాక్. కాబట్టి.. అనిల్ రావిపూడి, బాలయ్య సినిమా కోసం ఏదైనా కొత్తగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరో రిస్క్ కూడా ఉంది. బాలయ్యకు […]

Anil Ravipudi and Balayya Movie

Anil Ravipudi: నట సింహం బాలయ్య బాబుతో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక సినిమా చేయబోతున్నాడు. అనిల్ కి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ముఖ్యంగా హీరో ఎవరైనా తనదైన కామెడీని పెట్టి సినిమాని హిట్ చేస్తాడు. కాకపోతే.. బాలయ్య మీద కామెడీ ఏ రకంగానూ వర్కౌట్ అవ్వదు అనేది ఇండస్ట్రీలో ఉన్న టాక్. కాబట్టి.. అనిల్ రావిపూడి, బాలయ్య సినిమా కోసం ఏదైనా కొత్తగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరో రిస్క్ కూడా ఉంది. బాలయ్యకు వైవిధ్యం కూడా సెట్ అవ్వదు.

బాలయ్య అభిమానులకు మంచి మాస్ మసాలా యాక్షన్ అంశాలు కావాలి. కానీ బాలయ్య పై యాక్షన్ అంటే రొటీన్ అయిపోతుంది. సో.. బాలయ్య తరహా యాక్షన్ ను చూపిస్తూనే బాక్సాఫీస్ లెక్కలకు అనుకూలంగా స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీని అనిల్ రావిపూడి పెట్టాల్సి ఉంటుంది. సహజంగా అనిల్ రావిపూడి హీరోల పాత్రల్లోనే మంచి కామెడీని జనరేట్ చేస్తాడు. అంటే.. హీరోల పాత్రలకు ఏవో లోపాలు పెట్టి.. ఆ పాత్రను కామెడీగా నడిపిస్తాడు.

కానీ, బాలయ్య పాత్రకి లోపం అంటే.. సినిమాకే లోపం జరిగినట్లుగా ఫ్యాన్స్ భావిస్తారు కాబట్టి.. అనిల్ రావిపూడి ఆ రకంగానూ కామెడీని జనరేట్ చేయలేడు. మరి అనిల్ రావిపూడి బాలయ్య కోసం ఏమి చేస్తాడో చూడాలి. అక్టోబర్ మూడో వారం నుండి అనిల్ ఫ్రీ అయిపోతాడు. అప్పటికి ఎఫ్ 3 సినిమా పనులు అన్నీ అయిపోతాయి. నవంబర్ నుంచి బాలయ్య సినిమాని స్టార్ట్ చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడు.

అందుకే, బాలయ్య సినిమా ఫుల్ స్క్రిప్ట్ ను మరో ఆరేడు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. నిజానికి ఈ మధ్య బాలయ్యకి క్రేజ్ తగ్గింది, బాలయ్య సినిమాకి గట్టిగా నలభై కోట్లు కూడా రావడం లేదు. ఆయన గత సినిమాల నుండి ఇదే పరిస్థితి ఉంది. మరి అనిల్ రావిపూడి బాలయ్యతో ఎలాంటి సినిమా తీస్తాడు ? ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఏది ఏమైనా బాలయ్యతో సినిమా చేసి కెరీర్ ను అనిల్ రావిపూడి రిస్క్ లో పెట్టుకుంటునట్లే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper