Anchor Anasuya Bharadwaj Tweet: అనసూయ గట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తనకు తిక్క రేగితే ముక్కు ముఖం తెలియని వాడి కామెంట్ కి కూడా రెస్పాండ్ అవుతుంది. గతంలో ఎందరో నెటిజెన్స్ మీద ఆమె మండిపడ్డారు. తనపై విమర్శలు చేసినందుకు కౌంటర్స్ ఇచ్చారు. తాజాగా అనసూయను సంబంధం లేని వివాదం లాగిన ఓ వ్యక్తిపై విరుచుకుపడింది. యాంకర్ రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. ఆమె సోషల్ మీడియాలో జీవ హింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇటీవల బక్రీద్ పండగ జరిగింది.
ముస్లిమ్స్ తమ మతాచారంలో భాగంగా పెద్ద ఎత్తున జంతువులను బలిస్తారు. దీనికి వ్యతిరేకంగా రష్మీ ట్వీట్స్ చేశారు. దీంతో రష్మీ మీద ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయి. వ్యాపారం పేరుతో జీవహింస అనుక్షణం జరుగుతుంది. మీకు మా పండగ రోజు మాత్రమే జరిగే హింస మాత్రమే కనిపిస్తుందా అంటూ ఆమెను ప్రశ్నించారు. ఈ జీవ హింస వ్యవహారం కాస్త హిందూ-ముస్లిమ్స్ విబేధాలు, దాడుల వరకు చర్చ వెళ్ళింది.
ఓ నెటిజెన్… రష్మీకి గట్స్ ఉన్నాయి మాట్లాడుతుంది. అనసూయకు అంత ధైర్యం లేదు. ఎలాంటి విషయాలు మీద మాట్లాడదు అంటూ కామెంట్ చేశాడు. సదరు కామెంట్ అనసూయకు ఆగ్రహం తెప్పించింది. ఆమె రియాక్ట్ అయ్యారు. ‘అవును ఇలాంటి విషయాల మీద మాట్లాడేందుకు నాకు బాల్స్ లేవు. కానీ తెలిసిన అంశాల మీద మాట్లాడేందుకు వజీనా ఉంది. అయినా ప్రతి ఒక్కరు ప్రతి అంశం మీద స్పందించాల్సిన అవసరం లేదు, అంటూ బోల్డ్ ట్వీట్ చేసింది.
అనసూయ ట్వీట్ వైరల్ అవుతుంది. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న అనసూయను వివాదాలు మాత్రం వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో లొల్లి అయ్యింది. ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అనసూయ ఇటీవల వెల్లడించారు. విజయ్ దేవరకొండ దగ్గరున్న వ్యక్తి డబ్బులిచ్చి నాపై ట్రోల్స్ చేయిస్తున్నాడని తెలిసి నేను బాధపడ్డాను. అందుకే విజయ్ కి వ్యతిరేకంగా ట్వీట్స్ వేశానని ఆమె ఒప్పుకున్నారు.
Hello! Let me please correct you..I don’t have “balls”..but I do have the vagina to speak up on topics that I am completely aware of..also each one of us feel different kinds of purposes to heed to..the choices are entirely personal..unfair to expect everyone to “moo” no uncle?? https://t.co/oU2P3URAzj
— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 2, 2023