Anasuya Bharadwaj Bikini Pics Goes Viral
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఏకంగా బికినీలో దర్శనం ఇచ్చింది. ఆమె హాట్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. అనసూయ ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. మే 15న ఆమె బర్త్ డే. అనసూయ పుట్టినరోజు ముగిసిన రెండు మూడు రోజుల్లో పెద్ద కొడుకు పుట్టిన రోజు. వీరిద్దరి బర్త్ డే వేడుకల కోసం లాంగ్ ట్రిప్ ప్లాన్ చేశారు. అందమైన హిల్ స్టేషన్ ఎంచుకున్నారు. కొండల్లో కోనల్లో ఆహ్లాదంగా గడుపుతున్నారు. అక్కడి నదులు, సెలయేరులు, జలపాతాల్లో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఫ్యామిలీతో పాటు సెలయేరులో స్నానం చేస్తున్న అనసూయ ఫోటోలు వైరల్ గా మారాయి. అనసూయ బికిని ధరించడం చర్చకు దారి తీసింది. ఎన్నడూ చూడని లుక్ లో మెస్మరైజ్ చేసింది. అనసూయ బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే నేడు గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజు యాదవ్ మూవీ రిలీజ్. దాంతో మిత్రుడికి బెస్ట్ విషెస్ తెలియజేసింది. వెకేషన్ నుండి తిరిగి రాగానే మూవీ చూస్తానని హామీ ఇచ్చింది.
జబర్దస్త్ లో అనసూయ దాదాపు 9 ఏళ్ళు ఉన్నారు. 2022లో జబర్దస్త్ తో పాటు యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. జబర్దస్త్ కమెడియన్స్ తో అనసూయకు మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో గెటప్ శ్రీనుకు బెస్ట్ విషెస్ తెలియజేసింది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని తేల్చి చెప్పిన అనసూయ బుల్లితెర ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఎప్పటికీ ఆమె యాంకరింగ్ చేయరట. నటిగా, యాంకర్ గా ఉంటే ఆడియన్స్ అయోమయానికి గురవుతున్నారని అనసూయ అన్నారు.
నటిగా ఆమె కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఏడాదికి అరడజను సినిమాలు చేస్తుంది. గత ఏడాది అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్కో చిత్రంలో ఒక్కో విలక్షణ పాత్ర చేసింది. విమానం మూవీలో అయితే అనసూయ వేశ్యగా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తుంది. ఆమె షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్లు సమాచారం. అలాగే పెదకాపు సీక్వెల్ లో కూడా అనసూయ నటిస్తున్నారు.
Web Title: Anasuya bharadwaj bikini pics goes viral