Homeఎంటర్టైన్మెంట్రొమాంటిక్ సాంగ్ లో 'బన్నీ - రష్మిక' !

రొమాంటిక్ సాంగ్ లో ‘బన్నీ – రష్మిక’ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా ప్రస్తుతం సాంగ్ షూటింగ్ లో ఉంది. ఇది రొమాంటిక్ సాంగ్ అని.. ఈ సాంగ్ లో బన్నీ – రష్మిక మధ్య లవ్ బిల్డప్ షాట్స్ ఉంటాయని.. అలాగే బన్నీ మాస్ స్టెప్స్ కూడా ఈ సాంగ్ లో ఉంటాయని తెలుస్తోంది. ఇక శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తోన్న ఈ సాంగ్ లో కాస్త రొమాన్స్ ఘాటుగా ఉంటుందని.. ఎందుకంటే, […]

Allu Arjun-Rashmika
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా ప్రస్తుతం సాంగ్ షూటింగ్ లో ఉంది. ఇది రొమాంటిక్ సాంగ్ అని.. ఈ సాంగ్ లో బన్నీ – రష్మిక మధ్య లవ్ బిల్డప్ షాట్స్ ఉంటాయని.. అలాగే బన్నీ మాస్ స్టెప్స్ కూడా ఈ సాంగ్ లో ఉంటాయని తెలుస్తోంది. ఇక శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తోన్న ఈ సాంగ్ లో కాస్త రొమాన్స్ ఘాటుగా ఉంటుందని.. ఎందుకంటే, సినిమాలో బన్నీ ఓ ఆటవిక మనిషి అని, సో.. అతని రొమాన్స్ కూడా అలాగే ఉంటుందని ఇప్పటికే గతంలోనే రివీల్ చేశాము.

Also Read: ఆచార్య కోసం వెంటనే ఒప్పేసుకుంది !

ఇప్పుడు ఈ సాంగ్ ను అలాగే షూట్ చేస్తున్నారట. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసింది చిత్రబృందం. మరి ఈ సాంగ్ లో ఇంకెంత రొమాన్స్ ఉంటుందో చూడాలి. అసలుకే ఊర్వశి రౌటెలాకు హాట్ బ్యూటీ అని ఓ ప్రత్యేకమైన పేరు ఉంది. మరి ఆమె పై ఏ రేంజ్ లో ఐటమ్ సాంగ్ ను తీస్తారో. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటంతో… ఈ సినిమా మ్యూజిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: బాలయ్య సినిమాలో అల్లరి నరేష్ ?

ఇప్పటికే దేవి నాలుగు ట్యూన్స్ కంపోజ్ చేశాడట. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. కాగా శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది కాబట్టి.. బన్నీ టీం మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మిగతా సీన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ నిర్మిస్తారట. అయితే ప్రస్తుతం తక్కువమంది స‌భ్యుల‌తోనే షూట్ ను స్టార్ట్ చేసారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper