Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Raaka Movie: 'రాకా' అంటే అర్థం అదేనా.. ఇలాంటి పాత్రని కేవలం అల్లు...

Allu Arjun Raaka Movie: ‘రాకా’ అంటే అర్థం అదేనా.. ఇలాంటి పాత్రని కేవలం అల్లు అర్జున్ మాత్రమే చెయ్యగలడు..

Allu Arjun Raaka Movie: తన ప్రతీ కొత్త సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి పరితపించే హీరోల్లో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). ‘పుష్ప 2’ ఫస్ట్ లుక్ లో చీర కట్టుకొని పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన అల్లు అర్జున్, ఇప్పుడు ‘రాకా'(Raaka Movie) తో కూడా అదే తరహాలో అభిమానులను , ప్రేక్షకులను మెంటలెక్కిపోయేలా చేశాడు. ఇలాంటి టైటిల్ ని అసలు అభిమానులు ఊహించలేదు. ఈ […]

Allu Arjun Raaka Movie: తన ప్రతీ కొత్త సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి పరితపించే హీరోల్లో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). ‘పుష్ప 2’ ఫస్ట్ లుక్ లో చీర కట్టుకొని పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన అల్లు అర్జున్, ఇప్పుడు ‘రాకా'(Raaka Movie) తో కూడా అదే తరహాలో అభిమానులను , ప్రేక్షకులను మెంటలెక్కిపోయేలా చేశాడు. ఇలాంటి టైటిల్ ని అసలు అభిమానులు ఊహించలేదు. ఈ సోషల్ మీడియా యుగం లో దేనిని అయినా రహస్యంగా దాచడం అనేది అసాధ్యం. అలాంటిది మేకర్స్ ఈ టైటిల్ ని రెవీల్ చేసే వరకు చాలా రహస్యంగా ఉంచడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే అసలు ‘రాకా’ అనే టైటిల్ కి అర్థం ఏంటి?, ఒక స్టార్ హీరో కి ఇలాంటి టైటిల్ ని పెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అని సోషల్ మీడియా లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు నెటిజెన్స్.

‘రాకా’ అనే టైటిల్ ని ‘రాక్షసుడు’ అనే పేరు నుండి తీసుకున్నారు. ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్ర పూర్తిస్థాయి నెగెటివ్ లో కనిపించనుంది. సగం మనిషి , సగం మృగం జీవ కణాలతో జనమించిన ఒక వింత జీవిగా అల్లు అర్జున్ ఇందులో కనిపించనున్నాడు. ఈ పాత్ర సినేమానా వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది అట. ఇక రెండవ పాత్ర చాలా స్టైలిష్ గా ఉంటుందట. ప్రస్తుతం బయట మనం చూస్తున్న అల్లు అర్జున్ లుక్ , ఆ స్టైలిష్ రోల్ కి సంబంధించినదే. కానీ సోషల్ మీడియా లో అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, ఇతర హీరోల అభిమానుల నుండి మాత్రం వేరే లెవెల్ లో ట్రోల్స్ పడుతున్నాయి. పాత సినిమాలకు సంబంధించిన లుక్స్ అన్నిటిని మిక్స్ చేసి కొట్టేసినట్టు ఉంది.

ఇలాంటి గెటప్ ని తమిళ హీరో కార్తీ 15 ఏళ్ళ క్రితమే ‘కష్మురా’ చిత్రం లో వేసాడని , ఆ లుక్ తో పోలిస్తే ఇది గొప్పగా లేదని అంటున్నారు. అంతే కాకుండా ప్రముఖ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ చిత్రంలో, విక్రమ్ కాసేపు ఇలాంటి గెటప్ లో కనిపించినా, అదే బెటర్ గా ఉందని , ఇది వాటిని చూసే కాపీ కొట్టినట్టు ఉందని అంటున్నారు. అయితే స్టార్ హీరోల్లో ఇలాంటి లుక్ ని వేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా అలాంటి లుక్ ప్రయత్నించలేదు, భవిష్యత్తులో కూడా కష్టమే , కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చెయ్యగలడు అని మరికొంతమంది అంటున్నారు. మరి సినిమాలో ఈ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper