Homeఎంటర్టైన్మెంట్Meher Ramesh trolls : 'వారణాసి' , 'రాకా'.. ఈ రెండు సినిమాలకు ప్రేరణ మెహర్...

Meher Ramesh trolls : ‘వారణాసి’ , ‘రాకా’.. ఈ రెండు సినిమాలకు ప్రేరణ మెహర్ రమేష్.. పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు..

Meher Ramesh trolls : సోషల్ మీడియా లో యూత్ ఆడియన్స్ డైరెక్టర్ మెహర్ రమేష్ పై వేసే ట్రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సినిమాల్లోని సన్నివేశాలను షేర్ చేస్తూ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తుంటారు. ఒక సినిమాని ఎంత చెత్తగా తీయాలో మెహర్ రమేష్ ని చూసి నేర్చుకోవచ్చు, చెత్త సినిమాలకు ఆయన ఒక బెంచ్ మార్క్ అంటూ సెటైర్లు కురిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన […]

Meher Ramesh trolls : సోషల్ మీడియా లో యూత్ ఆడియన్స్ డైరెక్టర్ మెహర్ రమేష్ పై వేసే ట్రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సినిమాల్లోని సన్నివేశాలను షేర్ చేస్తూ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తుంటారు. ఒక సినిమాని ఎంత చెత్తగా తీయాలో మెహర్ రమేష్ ని చూసి నేర్చుకోవచ్చు, చెత్త సినిమాలకు ఆయన ఒక బెంచ్ మార్క్ అంటూ సెటైర్లు కురిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన సినిమాల్లోని పాత్రల పేర్లను , పాన్ వరల్డ్ సినిమాల్లో హీరోల పాత్రలకు పెట్టేస్తున్నారు. మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రాల్లో భారీ డిజాస్టర్ గా నిల్చిన చిత్రం ‘శక్తి’. ఎన్టీఆర్ హీరో గా నటించిన ఈ సినిమా ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ చిత్రాన్ని నిర్మించిన అశ్వినీ దత్ , దెబ్బకు దశాబ్దం పాటు సినిమాలు చేయడం కూడా మానేశాడు.

అయితే ఈ చిత్రం లోని పాత్రల పేర్లే ఇప్పుడు ‘వారణాసి'(Varanasi Movie), ‘రాకా'(Raaka Movie) చిత్రాలకు పెట్టారు. ‘వారణాసి’ లో హీరో మహేష్ బాబు(Super Star Mahesh Babu) పేరు రుద్ర. ‘శక్తి’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండవ పాత్ర పేరు కూడా రుద్ర అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక అదే శక్తి సినిమాలో ఒక విలన్ క్యారక్టర్ పేరు ‘రాకా’. ఆ పేరు నే ఇప్పుడు అల్లు అర్జున్(Icon Star Allu Arjun) , అట్లీ ప్రతిష్టాత్మక మూవీ కి పెట్టుకున్నారు. శక్తి మూవీ ఆరంభం లో విలన్ గ్యాంగ్స్ కి పరిచయం ఇస్తూ, డైరెక్టర్ మెహర్ రమేష్ ‘రాకా’ క్యారెక్టర్ ని వేరే లెవెల్ లో చూపిస్తాడు. ఇంటర్వెల్ సన్నివేశం లో ఆ క్యారెక్టర్ తో హీరో ఎన్టీఆర్ చేసే ఫైట్ వేరే లెవెల్ లో ఉంటుంది. సినిమా మొత్తానికి హైలైట్ అదే , ఆ పాత్ర టైటిల్ ని ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు వాడేశారు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియా.

పాన్ వరల్డ్ చిత్రాలుగా ప్రమోట్ అవుతున్న ఈ రెండు సినిమాలకు మా మెహర్ నోలన్ కారణం అంటూ సోషల్ మీడియా లో పడుతున్న ఫన్నీ ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు. మరో యాదృచ్చికంగా విషయం ఏమిటంటే , శక్తి చిత్రం లో విలన్ పాత్ర పేరు ‘రాకా’ నే , అదే విధంగా ‘రాకా’ లో విలన్ పాత్ర పేరు కూడా అదే. ఈ చిత్రం లో అల్లు అర్జున్ విలన్ పాత్రలో కూడా కనిపించబోతున్నాడు . నేడు విధాలా చేసింది ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ అట. వాస్తవానికి ఈరోజు గ్లింప్స్ వీడియో ని విడుదల చెయ్యాలని అనుకున్నారట కానీ, సీజీ వర్క్ బ్యాలన్స్ ఉండడం తో ఆపాల్సి వచ్చిందట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper