Homeఎంటర్టైన్మెంట్Akira Nandan birthday: అకిరా నందన్ పుట్టినరోజు నాడు.. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా...

Akira Nandan birthday: అకిరా నందన్ పుట్టినరోజు నాడు.. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్..

Akira Nandan birthday: నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , అక్కినేని అఖిల్ పుట్టినరోజు లతో పాటుగా , ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తనయుడు అకిరా నందన్ పుట్టినరోజు కూడా. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ చిన్న విషయాన్నీ అయినా ఒక పండుగలాగా జరుపుకునే అభిమానులు, అకిరా నందన్ పుట్టినరోజు వేడుకలను కూడా ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్రెండ్ చేయడమే కాకుండా, బయట ఆయన […]

Akira Nandan birthday: నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , అక్కినేని అఖిల్ పుట్టినరోజు లతో పాటుగా , ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తనయుడు అకిరా నందన్ పుట్టినరోజు కూడా. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ చిన్న విషయాన్నీ అయినా ఒక పండుగలాగా జరుపుకునే అభిమానులు, అకిరా నందన్ పుట్టినరోజు వేడుకలను కూడా ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్రెండ్ చేయడమే కాకుండా, బయట ఆయన పేరున సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే అందరిలో ఏర్పడిన ఒక ఆసక్తికరమైన సందేహం ఏమిటంటే, అకిరా నందన్ కి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శుభాకాంక్షలు తెలియజేస్తుందా లేదా అని. రీసెంట్ గానే ఆమె ఇన్ స్టాగ్రామ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలా యాక్టీవ్ గా పోస్టులు కూడా పెడుతోంది.

అయితే నేడు అకిరా పుట్టినరోజు సందర్భంగా , ఆమె చాలా ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ , ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నేడు నాకు , నా కుటుంబానికి చాలా ఎమోషనల్ డే. ఎందుకంటే ఈరోజు అకిరా నందన్ పుట్టినరోజు. ఇంత చిన్న వయస్సులో అతను ఆలోచించే విధానం , కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తిని చూస్తే మాకు చాలా గర్వంగా ఉంటుంది. అయితే దురదృష్టం కొద్దీ , ఇదే రోజున గత ఏడాది నా చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అకిరా పుట్టినరోజు ని గత ఏడాది మనస్ఫూర్తిగా జరుపుకోలేకపోయాము. కానీ నేడు మేము వీళ్లిద్దరి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఇదే రోజున గత ఏడాది మార్క్ శంకర్ కి రెండవ సారి జన్మించినట్టుగా మేము భావిస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చింది అన్నా లెజినోవా.

ఇక జరిగిన దుర్ఘటన గురించి మాట్లాడుతూ ‘ఈ సంఘటన జరిగి ఏడాది పూర్తి అయినప్పటికీ కూడా, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఈ ఘటన లో పదేళ్ల చిన్నారి ఫైరా చనిపోయింది, 18 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఇప్పటి వరకు ఈ ఘటనపై బాద్యులు ఎవరో తెలియలేదు. కొంతమంది చిన్నారులు అయితే ఇప్పటికీ కోలుకోలేదు. ఆ రేంజ్ లో వాళ్ళ శరీర భాగాలు కాలిపోయి ఉన్నాయి. కానీ దేవుడి కృప కారణంగా మార్క్ శంకర్ కి ఎలాంటి ప్రాణాపాయ స్థితి ఏర్పడలేదు. అతని ఊపిరి తిత్తులు డ్యామేజ్ అయ్యాయి కానీ , ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. నా బిడ్డ స్ట్రెచర్ మీద పడుకొని ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న రోజులు ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఏ తల్లికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది అన్నా లెజినోవా .

 

View this post on Instagram

 

A post shared by Anna Konidala (@anna.konidala)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper