spot_img
Homeఎంటర్టైన్మెంట్Jayaprada- Krishnam Raju: జయప్రదం కన్నీళ్లమయం.. కారణం రాజుగారితో అనుబంధమే !

Jayaprada- Krishnam Raju: జయప్రదం కన్నీళ్లమయం.. కారణం రాజుగారితో అనుబంధమే !

Jayaprada- Krishnam Raju: తెలుగు చిత్రసీమలో శ్రీ కృష్ణంరాజు గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ప్రముఖులు. రెబల్ స్టార్ మరణవార్త అందర్నీ శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు మరణంతో ప్రభాస్‌ అండ్ ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు గారి అంత్యక్రియలు నేడు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి ఫామ్‌హౌస్‌లో జరుగనున్నాయి. కృష్ణంరాజు గారి అంతిమ యాత్రలో… పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

Jayaprada- Krishnam Raju
Jayaprada- Krishnam Raju

మధ్యాహ్నం 1 గంటలకు కనకమామిడి ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. మరో పక్క కృష్ణంరాజు గారి భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తూ ఉన్నారు. తాజాగా కృష్ణంరాజు పార్థివదేహాన్ని చూసి జయప్రద బోరున విలపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యింది.

అయితే, ఈ సందర్భంగా జయప్రద కృష్ణంరాజు గారి గురించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ జయప్రద ఏం మాట్లాడింది అంటే.. ‘కృష్ణంరాజు గారు మచ్చలేని మనిషిగా, జీవితాంతం ఆయన రారాజుగానే బ్రతికారు. కానీ, నేను ఇప్పుడు ఆయనను ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఇది నాకు చాలా బాధాకరమైనది. ఆయనతో నాకు చాలా ప్రత్యేక అనుబంధం ఉంది’ అని జయప్రద కన్నీళ్లను ఆపుకుంటూ బోరున ఏడ్చింది.

Jayaprada- Krishnam Raju
Jayaprada- Krishnam Raju

అనంతరం.. ఆమె మళ్ళీ మాట్లాడుతూ.. ‘కృష్ణంరాజు గారి పిల్లలు చాలా చిన్నవాళ్లని, వారిని చూస్తే బాధేస్తోంది’ అని జయప్రద మళ్లీ కన్నీటి పర్యంతం అయ్యింది. రంగూన్ రౌడీ, తాండ్రపాపారాయుడు, సీతారాములు తదితర సినిమాల్లో రెబల్ స్టార్‌తో జయప్రద కలిసి నటించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.

అలాగే మరో సీనియర్ హీరోయిన్, మంత్రి రోజా కూడా ఆయనకు నివాళులర్పిస్తూ.. ‘సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రారాజు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ రోజా చెప్పుకొచ్చింది. పైగా ప్రభుత్వం తరఫున కృష్ణంరాజు అంత్యక్రియల్లో మంత్రి రోజా పాల్గొనబోతుంది.

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper