Renu Desai Second Marriage: ‘పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి’ రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఆ మధ్య బాగా హడావుడి చేసింది. తనకు కాబోయే రెండో భర్త ఫేస్ ను దాచేసి అతని ఫోటోను కూడా రేణు పోస్ట్ చేసింది. పైగా ఆ ఫోటోతో పాటు అతడి చేతికి తాను తొడిగిన రింగ్ ను చూపిస్తూ మరో ఫోటో కూడా జత చేసింది. ఇంత చేసి, ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. అయితే, తాజాగా రేణు దేశాయ్ తనకు రెండో భర్త దేనికి అవసరమో చెప్పింది.
రేణు దేశాయ్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఇంతకీ, ఆ పోస్ట్ లో రేణు ఏం ఉంది అంటే.. ‘జీవితంలో చాలా ఫేస్ చేయాలి. ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి’ అంటూ రేణు ఇన్స్టాలో ఒక మెసేజ్ షేర్ చేసింది. తన రెండో పెళ్లి పై రేణు ఈ విధంగా కామెంట్స్ చేసిందా ? అని నెటిజన్లు అనుమాన పడుతున్నారు.
నిజానికి గతేడాది సరదాగా ఆలీతో షోకి వచ్చింది రేణుదేశాయ్. ఆ షోలోనే తన రెండో భర్త గురించి క్లుప్తంగా చెప్పుకొచ్చింది. తన కొత్త భర్త ఓ ఐటీ కంపెనీ మేనేజర్ అని, గతంలో అమెరికాలో జాబ్ చేసేవాడని, తన తండ్రికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణేలో జాబ్ చేస్తున్నాడని రేణు చెప్పుకొచ్చింది. కానీ, అతన్ని పెళ్లి చేసుకుందా ? లేదా ? అని మాత్రం చెప్పలేదు.
ఆ తర్వాత, మరో ఇంటర్వ్యూలో తాను రెండో పెళ్లి పై చాలా రోజుల పాటు ఆలోచన చేశానని… అయితే తన సంతోషం కోసం, తన పిల్లల కోసం తాను రెండో పెళ్లి చేసుకోక తప్పడం లేదని చెప్పింది. రేణు దేశాయ్ పాల్గొన్న అదే షోలో రేణు రెండో భర్త ఓ వాయిస్ ఓవర్ కూడా పంపించి షాక్ ఇచ్చాడు. అతగాడు రేణును ఆకాశానికి ఎత్తేశాడు. రేణు వల్లే తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని అతను మెచ్చుకున్నాడు.
ఐతే, ఆ తర్వాత వీరి పెళ్లి పై ఎలాంటి క్లారిటీ లేదు. వీరి ఎంగేజ్మెంట్ జరిగి కూడా రెండేళ్లు అయింది. ఇప్పటివరకు రేణు దేశాయ్ తన రెండో భర్త గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అసలు అతను ఎవరు ? ఎక్కడ ఉంటాడు ? లాంటి విషయాల పై ఎవ్వరికి క్లారిటీ లేదు. అసలు ఆమె రెండో పెళ్లి చేసుకుందా ? లేదా ? అనే విషయం పై కూడా స్పష్టత లేదు. కానీ సడెన్ గా రేణు దేశాయ్ ఇప్పుడు షేర్ చేసిన పోస్ట్ ను బట్టి.. ఆమె ఇప్పటికే రెండో పెళ్లి చేసుకుందని అనుమానం కలుగుతుంది.
పైగా రేణు దేశాయ్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె రెండో పెళ్లి చేసుకుంది. రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంది అని తెలిస్తే.. నెటిజన్లు రెచ్చిపోతారు కాబట్టి.. ఆమె ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతుందట. ప్రస్తుతానికి అయితే, రేణు దేశాయ్ రెండో భర్త ఆమెతోనే కలిసి ఉంటున్నాడు.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Sensational facts about renu desais second marriage renu gave clarity with a post
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com