Aadarsa Kutumbam: విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే మంచి కాంబినేషన్ చిత్రం కాబట్టి , డివైడ్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంతా అనుకున్నారు. దసరా సీజన్ కి వచ్చి ఉండుంటే బ్రేక్ ఈవెన్ మార్కు సులువు అయ్యేది , కానీ ఇప్పుడు మాత్రం ఈ చిత్రం డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్స్ కి 50 శాతం నష్టాలు వచ్చేలా లాగా ఉన్నాయి. అంటే త్రివిక్రమ్ కెరీర్ లో ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి మించిన ఫ్లాప్ అవ్వబోతుంది అన్నమాట. ఓవర్ ఆల్ గా వారం రోజున థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 34 కోట్ల 52 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో 10 కోట్ల షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రాంతాల వారీగా ఈ చిత్రం రాబట్టిన వసూళ్ల విషయానికి వస్తే , నైజాం ప్రాంతం నుండి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ నుండి 2 కోట్ల 60 లక్షల రూపాయిలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి 10 కోట్ల 52 లక్షల రూపాయిలను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 41 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 6 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 34 కోట్ల 52 లక్షల షేర్ వసూళ్లు , 65 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి.