Bigg Boss 10 Telugu: జనాల అభిప్రాయం తో మాకు పని లేదు , మాకు తోచింది మేము చేసుకుంటాము , ఇష్టముంటే చూడండి , లేదంటే లేదు అనే తరహా లో ‘బిగ్ బాస్ 10’ టీం ఈ సీజన్ మొత్తం వ్యవహరిస్తూ వచ్చింది. వాళ్ళు కోరుకున్న వాళ్ళని టైటిల్ విన్నర్ చేయడం కోసం , ఏకంగా విన్నింగ్ రేస్ లో ఉన్న రోహిత్ లాంటి టాప్ కంటెస్టెంట్ ని జనాల ఓట్లతో సంబంధం లేకుండా, హౌస్ మేట్స్ ఓట్లతో తొలగించి , చరిత్రలో ఏ కంటెస్టెంట్ కి చెయ్యని అన్యాయం చేసింది బిగ్ బాస్ టీం. దాని ప్రభావం టీఆర్ఫీ రేటింగ్స్ పై బలంగా పడింది. ఎందుకంటే ఈ సీజన్ ని సగం మంది ప్రేక్షకులు రోహిత్ కోసమే చూస్తున్నారు. అలాంటి రోహిత్ ఎలిమినేట్ అవ్వడంతో 11 రేటింగ్స్ వచ్చే ఈ షో కి , ఇప్పుడు కేవలం 4 రేటింగ్స్ మాత్రమే వస్తుందట.
జనాల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే , ఇలాంటి ఫలితాలే వస్తుంటాయని అంటున్నారు విశ్లేషకులు. అయితే రేటింగ్స్ పడిపోయాయి కాబట్టి , ఇప్పుడు రోహిత్ ని మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీకెండ్ లో ఆయన కచ్చితంగా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతోంది , కానీ అదే సమయం లో ఆయన రీ ఎంట్రీ ఉండదు అనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం 4 నుండి 5 మధ్యలో టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినా బిగ్ బాస్ టీం కి సరిపోతుందని , కానీ ఇప్పుడు రోహిత్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తే , అతను కచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతాడని , మరోసారి సామాన్యుడు టైటిల్ విన్నర్ గా నిలిస్తే వచ్చే సీజన్ నుండి సెలబ్రిటీలు బిగ్ బాస్ వైపు కూడా చూడరని , అందుకే రోహిత్ చేత రీ ఎంట్రీ చేయించకపోవడమే మంచిదని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే.