ఎడ్యుకేషన్ఇండియన్‌ ఆర్మీ ఉద్యోగాలకు రెండేళ్ల వయస్సు పెంచారా.. నిబంధనలివే?

ఇండియన్‌ ఆర్మీ ఉద్యోగాలకు రెండేళ్ల వయస్సు పెంచారా.. నిబంధనలివే?

మన దేశంలోని ప్రజలు సైనికులను ఎంతో గౌరవిస్తారనే సంగతి తెలిసిందే. ఆర్మీలో చేరాలని ఆసక్తి చూపే యువత సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్మీ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజైతే దరఖాస్తు చేసే వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కు సంబంధించి ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోందని తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది జరిగే రిక్రూట్‌మెంట్‌ కొరకు 2 సంవత్సరాల వయస్సు సడలింపులు ఇచ్చారని ఒక వార్త వైరల్ అవుతోంది.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పై ఆసక్తి చూపే యువతలో ఎక్కువమంది ఈ వార్తను నిజమేనని నమ్ముతున్నారు. ఒక న్యూస్ ఛానల్ కు సంబంధించిన క్లిప్ వైరల్ అవుతుండగా ఆ వార్తను ఎడిట్ చేసి ప్రిపేర్ చేశారని తెలుస్తోంది. అయితే వైరల్ అవుతున్న వార్త గురించి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి వివరణ ఇచ్చింది. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కు సంబంధించిన వయో పరిమితిలో ఎలాంటి మార్పు లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.

నకిలీ మెసేజ్ లను, నకిలీ ఫోటోలను వైరల్ చేయవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. పదో తరగతిలో 45 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఆర్మీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయవచ్చు.

పురుష అభ్యర్థులతో పాటు మహిళా అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణత ఉంటే ఆ ఉత్తీర్ణతతో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Indian Army: మరో పాశుపతాస్త్రం.. ఇండియన్ ఆర్మీనా మజాకా.. మనతో పెట్టుకుంటే మటాషే..

Indian Army: భారత రక్షణ రంగం పాశుపతాస్త్రంను సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత శక్తి వంతంగా గుర్తింపు పొందిన ఇడియన్ ఆర్మీ చేతిలోకి ఇది రావడంతో మరింత బలం చేకూరినట్లయింది. పూర్తిగా...

Eagle Arjun: ఇది మన అర్జున్.. చైనా, పాక్ కు పక్కలో బల్లెం..

Eagle Arjun: దాని పేరు అర్జున్. ఆకాశం లో అలుపు అనేది లేకుండా తిరుగుతుంది. తన చూపుతో ఎంతటి చిన్న వస్తువునైనా కనిపెడుతుంది. అది ప్రమాదకరం అని తెలిస్తే వెంటనే నాశనం చేస్తుంది....

Most Popular

Gaokao Exam World Toughest Exam: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష అందే.. 1.29 కోట్ల మంది విద్యార్థుల...

Gaokao Exam World Toughest Exam: భారత దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష ఏదంటే చాలా మంది జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌ అని చెబుతారు. కొందరు సివిల్స్‌ కూడా అంటారు. మరి ప్రపంచంలో...

CBSE OSM evaluation issue: CBSE మూల్యాంకనంలో OSM వివాదం ఏంటీ.. అసలేం జరిగింది..

CBSE OSM evaluation issue: Central Board of Secondary Education మూల్యాంకన విధానంలో ఉపయోగిస్తున్న ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థపై వివాదం నెలకొంది. డిజిటల్ టెక్నాలజీ ద్వారా మూల్యాంకన ప్రక్రియను వేగవంతం...

Central govt jobs for unemployed youth: నిరుద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. దరఖాస్తు చేసుకోండి.. కొలువు కొట్టండి!

Central govt jobs for unemployed youth: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో వెంటనే కేంద్రం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో నిరుద్యోగుల కోసం భారీగా ఉద్యోగ...

10th pass government jobs: 10 పాస్ అయ్యారా.. ఈ సర్కారీ కొలువులు మీకోసమే.. సిద్ధమేనా..

10th pass government jobs: రెండు తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చేసాయి. చాలామంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మెరిట్ మార్కులు సాధించి అదరగొట్టారు. కొందరేమో తదుపరి చదువులు చదవడానికి సిద్ధంగా...

Telangana 10th class results 2026: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

Telangana 10th class results 2026: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 13 వరకు పరీక్షలు జరిగాయి. మూల్యాంకనం పూర్తి కావడంతో విద్యాశాఖ ఫలతాలు...
Exit mobile version