దేవాలయాల్లో కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి.. కుళ్లిపోతే ఏం చేయాలి?

హిందువులలో చాలామంది ప్రత్యేక రోజుల్లో దేవాలయాలకు వెళుతూ ఉంటారు. పండుగ రోజులలో కచ్చితంగా దైవ దర్శనానికి వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది మానసిక ప్రశాంతత కొరకు దేవాలయాలకు తరచూ వెళుతుంటారు. దేవాలయాలకు వెళ్లిన సమయంలో ఎక్కువమంది కొబ్బరికాయను కొట్టడం చేస్తారు. అయితే కొబ్బరికాయ కొడుతారనే విషయం తెలిసినా ఎందుకు కొడుతారనే ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి దేవాలయాలలో కొబ్బరికాయ కొట్టడాన్ని కొనసాగిస్తున్నారు. దేవునిపై ఉండే భక్తితో పాటు సమాజాన్ని పరిపాలించే […]

Written By: Kusuma Aggunna, Updated On : November 4, 2021 6:51 am
Follow us on

హిందువులలో చాలామంది ప్రత్యేక రోజుల్లో దేవాలయాలకు వెళుతూ ఉంటారు. పండుగ రోజులలో కచ్చితంగా దైవ దర్శనానికి వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది మానసిక ప్రశాంతత కొరకు దేవాలయాలకు తరచూ వెళుతుంటారు. దేవాలయాలకు వెళ్లిన సమయంలో ఎక్కువమంది కొబ్బరికాయను కొట్టడం చేస్తారు. అయితే కొబ్బరికాయ కొడుతారనే విషయం తెలిసినా ఎందుకు కొడుతారనే ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు.

కొన్ని వందల సంవత్సరాల నుంచి దేవాలయాలలో కొబ్బరికాయ కొట్టడాన్ని కొనసాగిస్తున్నారు. దేవునిపై ఉండే భక్తితో పాటు సమాజాన్ని పరిపాలించే నియమాలను పాటించడం, ఆచారాలకు సూచికగా కొబ్బరికాయను కొట్టడం జరుగుతుంది. ఎంతో ప్రాధాన్యత ఉండే కొబ్బరికాయను మనిషి తలతో పోల్చడం జరుగుతుంది. కొబ్బరికాయలో ఉండే నీళ్లను రక్తంతో, కొబ్బరికాయపై ఉండే పీచును మనిషి జుట్టుతో, గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో పోల్చడం జరుగుతుంది.

టెంకాయలో ఉండే లేతకొబ్బరిని మనిషి మనస్సుగా భావించడం జరుగుతుంది. టెంకాయ కొట్టడం ద్వారా మనిషి యొక్క ఈర్ష్యాద్వేషాలు, అహంకారం, కల్మషం తొలగిపోతాయని చాలామంది బలంగా నమ్ముతారు. మన అహంకారానికి ప్రతీకగా కొబ్బరికాయపై ఉండే పెంకును పోలుస్తారు. కొబ్బరి కాయ నిలువుగా పగిలితే కొడుకు లేదా కూతురికి సంతానం కలుగుతుందని అర్థం.

కొబ్బరికాయ సమానంగా పగిలితే మంచి జరగడంతో పాటు మనస్సులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. కొబ్బరికాయ కుళ్లితే చెడు జరుగుతుందని చాలామంది నమ్ముతారు. కొబ్బరి కాయ కుళ్లితే మన మనస్సులోని చెడు స్వభావం తొలగిపోయిందని నమ్మాలి.