Indian Army Soldier Sacrifice : జై జవాన్.. జై కిసాన్ అంటాము. దేశంలో ఈ ఇద్దరికే అధిక ప్రాధాన్యం మన ధైర్యంగా గుండెలపై చేయి వేసుకుని నిద్రపోతున్నామంటే కారణం సైనికులే. దేశ సరిహద్దులు ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడతారు. ఇక రైతన్న లేకుండే మన ఐదు వేళ్లు నోట్లోకు వెళ్లవు. రైతన్న చెమటోడ్చి పండిస్తేనే మనకు ఆహారం. ఇక మన సైనికుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎముకలు కొరికే తీవ్ర చలికాలంలో భారత సరిహద్దుల్లో సైనికులు అచంచలంగా కాపలా నిలబడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక చిత్రం వారి త్యాగానికి చిహ్నంగా మారింది. ఈ వీడియోలో మంచులో నిద్రిస్తున్న సైనికుడిని మరో సైనికుడు వచ్చి నిద్రలేపడం కనిపిస్తుంది. బరువెక్కిన మంచు దిప్పటి నుంచి సైనికుడు బయటకు రావడం మన హృదయాలను స్పృశిస్తుంది.
సైనికుల సవాళ్లు
మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో దేశ సరిహద్దులు కాపాడటం సాధారణం కాదు. మంచు తుఫానులు, చలి తుఫానులు వారిని పరీక్షిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారు ధైర్యంగా నిలబడి, శత్రు చర్యలను అడ్డుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ చిత్రం వైరల్ అవుతోంవది. అందులో సైనికుడు మంచులో దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. దానిపై మంచు పేరుకుపోయింది. దీనిపై నెటిజన్ల సైనికుల సేవలను ప్రశంసిస్తున్నారు.
సెల్యూట్ ఆర్మీ..
సోషల్ మీడియాలో ‘సెల్యూట్ ఇండియన్ ఆర్మీ‘ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అయింది. నెటిజన్లు వారి ‘ఉక్కు సంకల్పం’ను కొనియాడుతూ, త్యాగాలకు గౌరవం చెల్లించారు. ఇది పౌర–సైనిక సంబంధాన్ని బలోపేతం చేస్తోంది. ఈ చిత్రం సైనికుల అంకితభావానికి, దేశభక్తికి నిదర్శనం. చలికాలంలో ఇలాంటి సేవలు దేశ భద్రతకు మూలస్తంభం. పౌరుల్లో గౌరవం పెరగడం సైన్యానికి మరింత ఉత్సాహాన్నిస్తుంది.
మైనస్ డిగ్రీల చలిలో, ఎముకలు కొరికే మంచు కురుస్తున్నా భారత సరిహద్దుల్లో సైనికుల పహారా ఆగడం లేదు. తాజాగా ఓ సైనికుడు ఆరుబయట నిద్రిస్తున్న ఫోటో నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఆయన కప్పుకున్న దుప్పటిపై మంచు పొరలు పేరుకుపోయినా, దేశ రక్షణే ధ్యేయంగా వారు చూపుతున్న ధైర్యం అమోఘం. మనం ప్రశాంతంగా… pic.twitter.com/9hmPBSJmvE
— ChotaNews App (@ChotaNewsApp) January 26, 2026
