https://oktelugu.com/

Nandamuri Balakrishna: నేటి నుంచి ఓటిటిలో “అన్ స్టాపబుల్” గా గర్జించనున్న బాలయ్య… స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Nandamuri Balakrisna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో “అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె ” అనే టాక్ షో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొట్ట మొదటిసారి బాలయ్య హోస్ట్‏గా  చేయబోతుండడంతో ఈ టాక్ షో కోసం ఆయన అభిమానులే కాకుండా అందరూ ఈ షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ షో కు సంబంధించి విడుదలైన ప్రోమోలో తనదైన డైలాగ్ లతో బాలయ్య దుమ్ము లేపారు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 4, 2021 / 08:10 AM IST
    Follow us on

    Nandamuri Balakrisna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో “అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె ” అనే టాక్ షో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొట్ట మొదటిసారి బాలయ్య హోస్ట్‏గా  చేయబోతుండడంతో ఈ టాక్ షో కోసం ఆయన అభిమానులే కాకుండా అందరూ ఈ షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

    ఇటీవల ఈ షో కు సంబంధించి విడుదలైన ప్రోమోలో తనదైన డైలాగ్ లతో బాలయ్య దుమ్ము లేపారు అనే చెప్పాలి. యూట్యూబ్ లో ఈ ప్రోమో లు సృష్టించిన సెన్సేషన్ మామూలుగా లేదు. అలానే ఈ షో లో తెలుగు చిత్రా పరిశ్రమకు చెందిన ప్రముఖులు గెస్ట్ లుగా హాజరు కాబోతుండగా… ఆ గెస్ట్ లు ఎవరా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు ప్రోగ్రాం లో ఫస్ట్ గెస్ట్ గా మంచు మోహన్ బాబు తన బిడ్డలు లక్ష్మి, విష్ణు లతో కలిసి షో లో పాల్గొన్న ప్రోమో ను కూడా విడుదల చేశారు. అయితే ఈ మేరకు విడుదలైన ప్రోమోలో బాలయ్య మోహన్ బాబు ల మధ్య సినీ , రాజకీయలకు సంబంధించిన విషయాలను చర్చించుకున్నారు.

    తనదైన  శైలిలో ప్రశ్నలు సంధిస్తూ షో ను ఆసక్తి బరితంగా నడిపించారు బాలకృష్ణ. కాగా దీపావళి కానుకగా ఈరోజు నుంచి ఈ షో ప్రసారం కానుందని ముంద్దుగానే ప్రకటించిన ఈ సమయం నుంచి అనేది క్లారిటి రాలేదు. అయితే తాజాగా ఈ ప్రోగ్రాం ఉదయం 11.20 నిమిషాల నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అన్ స్టాపబుల్ నిర్వాహకులు ప్రకటించారు. మరి ఆలస్యం చేయకుండా బాలయ్య హోస్టింగ్ ను బుల్లితెరపై చూసెయ్యడానికి సిద్దంగా ఉండండి.