Homeఉద్యోగాలుCentral govt jobs for unemployed youth: నిరుద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. దరఖాస్తు చేసుకోండి.....

Central govt jobs for unemployed youth: నిరుద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. దరఖాస్తు చేసుకోండి.. కొలువు కొట్టండి!

Central govt jobs for unemployed youth: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో వెంటనే కేంద్రం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో నిరుద్యోగుల కోసం భారీగా ఉద్యోగ అవకాశాలు వెలువడ్డాయి. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో మొత్తం 12 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రూ.25 వేల నుంచి లక్ష రూపాయల వరకు వేతనంతో కూడిన ఈ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. స్థిరమైన కెరీర్‌ను కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశం.

నోటిఫికేషన్ల వివరాలు ఇవీ..
కేంద్రం విడుదల చేసిన వాటిలో నాలుగు నోటిఫికేషన్లు ఉన్నాయి. ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నవారికి అర్హతలను బట్టి మంచి అవకాశం.

సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌లో 9,195 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌ – ట్రేడ్స్‌మెన్, పయనీర్‌) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి మే 19వ తేదీ వరకు అవకాశం ఉంది.

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ (గ్రేడ్‌ సీ అండ్‌ డీ)..
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా 731 గ్రేడ్‌ సీ, డీ స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆర్‌బీఐ గ్రేడ్‌–బీ ఆఫీసర్‌..
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 60 గ్రేడ్‌–బీ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత ఉన్నవారు మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. కాస్త కష్టపడితే కొలువు కొట్టడం ఈజీ.

SPMCIL జూనియర్‌ టెక్నీషియన్‌…
సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (SPMCIL)లో 534 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 19 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశంఉంది.

ఎన్‌టీపీసీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌..
నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ)లో 250 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు కేంద్రం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దరఖాస్తుల గడువు మే 7వ తేదీ వరకు ఉంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు సంబంధిత సంస్థల అధికారిక వెబ్‌సైట్లను సందర్శించి, పూర్తి నోటిఫికేషన్లను పరిశీలించాలి. అర్హత, వయోపరిమితికి సంబంధించిన నిబంధనలను తనిఖీ చేసుకుని, గడువులోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉన్నందున, అభ్యర్థులు ముందుగానే సిద్ధమై, తప్పులు లేకుండా దరఖాస్తులను సమర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version