మన దేశంలోని ప్రజలు సైనికులను ఎంతో గౌరవిస్తారనే సంగతి తెలిసిందే. ఆర్మీలో చేరాలని ఆసక్తి చూపే యువత సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్మీ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజైతే దరఖాస్తు చేసే వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే ఆర్మీ రిక్రూట్‌మెంట్ కు సంబంధించి ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోందని తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది జరిగే రిక్రూట్‌మెంట్ కొరకు 2 సంవత్సరాల వయస్సు సడలింపులు ఇచ్చారని ఒక వార్త వైరల్ అవుతోంది.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ పై ఆసక్తి చూపే యువతలో ఎక్కువమంది ఈ వార్తను నిజమేనని నమ్ముతున్నారు. ఒక న్యూస్ ఛానల్ కు సంబంధించిన క్లిప్ వైరల్ అవుతుండగా ఆ వార్తను ఎడిట్ చేసి ప్రిపేర్ చేశారని తెలుస్తోంది. అయితే వైరల్ అవుతున్న వార్త గురించి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి వివరణ ఇచ్చింది. ఆర్మీ రిక్రూట్‌మెంట్ కు సంబంధించిన వయో పరిమితిలో ఎలాంటి మార్పు లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.
నకిలీ మెసేజ్ లను, నకిలీ ఫోటోలను వైరల్ చేయవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. పదో తరగతిలో 45 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఆర్మీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయవచ్చు.
పురుష అభ్యర్థులతో పాటు మహిళా అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణత ఉంటే ఆ ఉత్తీర్ణతతో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.