Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో భారత వాయుసేన దాడులకు పాకిస్తాన్ తీవ్ర నష్టాలు సహించింది. మొదట పాక్ అధికారులు తమ వైపు ఎలాంటి లాసెస్ లేవని దాచిపెట్టారు. కానీ, స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అమరవీరుల పురస్కారాలు ప్రకటించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ ఎయిర్ బేస్‌లకు మరమ్మతులు చేయించుకుంటున్నారు. దీనికి సంబంధించిన పొటోలు, వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఇక పాకిస్తాన్ మంత్రులు కూడా తమవైపు నష్టం జరిగిందని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. ఇక సీజ్‌ఫైర్ వెనుక ఉన్న రహస్యాలు బయటపెడుతున్నారు.
అమర సైనికులకు నివాళి..
స్వాతంత్య్ర రోజు వేడుకల్లో పాక్ మంద మందికి పురస్కారాలు ప్రకటించింది. ఇవి మరనానంతరం ప్రకటించేవి. దీంతో అప్పట్లోనే ఆపరేషన్ సిందూర్‌తో వంద మందికిపైగా మరణించారని నిర్ధారణ అయింది. తాజాగా 600 మంది సైనికులకు నివాళులు అర్పించింది. వీరంతా భారత వైమానిక దాడుల్లో మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ తర్వాత పాక్ ఎవరితోనూ యుద్ధం చేయలేదు కాబట్టి, ఇది సిందూర్ దాడుల పరిణామమేనని నిర్ధారణ.
ఉగ్రవాదులు, అణు స్థావరం దెబ్బ..
ఇదిలా ఉంటే ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్‌లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. 9 ఉగ్రస్థావరాలపై భారత వైమానికదళం సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇక దీని తర్వాత పాకిస్తాన్ దాడులను తిప్పి కొడుతూ ఆ దేశంలోని 11 ఎయిర్ బేస్‌లపై భారత వాయుసేన దాడి చేసింది. ఈ దాడిలో ఎయిర్ బేస్‌లవద్ద ఉన్న సైనికులతోపాటు సరిహద్దులోని సైనికులు కూడా మరణించారు.
పాకిస్తాన్ మొదట నష్టాలు దాచడం వల్ల అంతర్జాతీయ పైచేయి సాధించామని ప్రచారం చేసుకుంది. భారత దాడులు ఉగ్రవాద కేంద్రాలు, సైనిక బలగాలను లక్ష్యంగా చేశాయి. పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం జరిగింది. ఆపరేషన్ సిందూర్ 2.0 ప్రారంభిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే ఉండదని భారత ఆర్మీ చీఫ్ హెచ్చరించారు.
کارگل میں 600 فوجی مارے گئے جن کی ڈیڈ باڈی ہمارے فوجی جنرلوں نے لینے سے انکار کر دیا کے کسی کو پتہ نہ چل جاے کے ہمارے کتنے فوجی مارئے گئے۔۔۔
تا کہ ایک اور شکست کو چھپایا جا سکے ۔۔ pic.twitter.com/ocMZ4BCdKu— Baba G (@BabaG512) January 8, 2026