
ప్రముఖ ఈకామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. రోజులో కేవలం 4 నుంచి 5 గంటలు పని చేయడం ద్వారా ఏకంగా 20,000 రూపాయలు పొందే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. వారానికి 5,000 రూపాయల చొప్పున ఖాతాలలో నగదు జమయ్యే అవకాశాలు అవకాశాలు ఉంటాయి. ఆసక్తి ఉన్నవాళ్లు ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్ ఈ ఉద్యోగాలు చేయవచ్చు.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు అమెజాన్ ప్యాకేజీలను కస్టమర్లకు డెలివరీ చేయడం ద్వారా సులభంగా డబ్బులను సంపాదించవచ్చు. దేశంలో డెలివరీ బాయ్స్ కు డిమాండ్ ఊహించని స్థాయిలో ఉన్న నేపథ్యంలో సులువుగా జాబ్ పొందే అవకాశం ఉండటంతో పాటు ప్రతి నెలా మంచి ఆదాయం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
https://flex.amazon.in/lets-drive లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుని ఎంపికైన వాళ్లు గంటకు 120 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్‌లో ఈ సర్వీసులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు బైక్ కచ్చితంగా ఉండాలి.
డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్‌సీ డాక్యుమెంట్లతో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉంటే మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిరుద్యోగులకు అమెజాన్ ఫ్లెక్స్ సర్వీస్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.