
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్లాట్ గా ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా మార్కెట్లలో కొనసాగుతున్న కరోనా భయాలు ఇక్కడి సూచీలపై ప్రభావం చూపాయి. చివరకు సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 54,525 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు ఎగబాకి 16,282 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.44 వద్ద నిలిచింది. కీలక కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవడం కూడా సూచీలను కిందకు లాగాయి.