Homeక్రైమ్‌Eating Mangoes: మామిడి పండ్లు తింటే చనిపోతారా..

Eating Mangoes: మామిడి పండ్లు తింటే చనిపోతారా..

Eating Mangoes: ఆమధ్య ముంబైలో పుచ్చకాయ తిన్న తర్వాత ఒక కుటుంబంలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఊపిరి ఆడక చనిపోయారు. పుచ్చకాయ తినడానికి అంటే ముందు వారు మటన్ బిర్యానీ తిన్నారు. మటన్ బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ ఆరగించారు. పుచ్చకాయ తిన్న తర్వాత వారు చనిపోవడంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కొందరు వైద్యులు అయితే పుచ్చకాయను రాత్రిపూట తింటే చనిపోతారని రకరకాల ఊహాగానాలను వ్యాప్తి చేశారు. దీంతో దేశవ్యాప్తంగా పుచ్చకాయల కొనుగోలు […]

Eating Mangoes: ఆమధ్య ముంబైలో పుచ్చకాయ తిన్న తర్వాత ఒక కుటుంబంలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఊపిరి ఆడక చనిపోయారు. పుచ్చకాయ తినడానికి అంటే ముందు వారు మటన్ బిర్యానీ తిన్నారు. మటన్ బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ ఆరగించారు. పుచ్చకాయ తిన్న తర్వాత వారు చనిపోవడంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కొందరు వైద్యులు అయితే పుచ్చకాయను రాత్రిపూట తింటే చనిపోతారని రకరకాల ఊహాగానాలను వ్యాప్తి చేశారు. దీంతో దేశవ్యాప్తంగా పుచ్చకాయల కొనుగోలు తగ్గిపోయాయి. ఆ తర్వాత విచారణ నిర్వహిస్తే అందులో క్రిమిసంహారక పదార్థాలు కలిపారని వార్తలు వచ్చాయి. దీంతో పుచ్చకాయ తినడం వల్ల వారు చనిపోలేదని.. అందులో విష ప్రయోగం జరిగిందని అందువల్ల చనిపోయారని తేలింది.

మన హైదరాబాదులో మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కా చెల్లెలు చనిపోయారు. హైదరాబాద్ నగర పరిధిలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో భువనేశ్వరి (17) అనే బాలిక ముందుగా చనిపోయింది.. ఆమె సోదరి సంధ్య (10) మంగళవారం కన్ను మూసింది. చనిపోయిన ఇద్దరు కూడా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నగరం. బీదర్ ప్రాంతానికి చెందిన వై జి నాథ్, తన భార్య ఇందుమతితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ విటల్ వాడి అనే ప్రాంతంలో జీవిస్తున్నాడు. వై జి నాథ్ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరి కుటుంబానికి రేణుకానే బంధువు ఉంది. ఇటీవల వీరిని చూసేందుకు వస్తూ ఉండగా నారాయణగూడ లోని జలమండలి కార్యాలయం దగ్గర మామిడి పండ్లను కొనుగోలు చేసింది. ఆ మామిడి పండ్లను ఇందుమతి, ఆమె నలుగురు కుమార్తెలు తిన్నారు. ఆదివారం ఐదుగురు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని కవాడిగూడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భువనేశ్వరి కన్నుమూసింది. మంగళవారం చిన్న కుమార్తె సంధ్య కన్ను మూసింది. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఈ ఘటనపై వృద్ధుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామిడి పండ్లు తిన్న తర్వాత ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారని.. అస్వస్థతకు గురయ్యారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఆ మామిడి పండ్ల నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం పంపించారు. వచ్చిన వివరాల ఆధారంగా అసలు నిజాలు బయటపెడతామని అధికారులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper