Homeఆంధ్రప్రదేశ్‌Students Lodge Incident: ఆంటీ ని చూసి కక్కుర్తి పడ్డారు.. చివరికి ఈ నలుగురు కుర్రాళ్ల...

Students Lodge Incident: ఆంటీ ని చూసి కక్కుర్తి పడ్డారు.. చివరికి ఈ నలుగురు కుర్రాళ్ల జీవితం ఏమైందంటే?

Students Lodge Incident: అనుభవం అనేది ఒక మనిషిని అనేక రకాలుగా మార్చేస్తూ ఉంటుంది. అది మంచి అనుభవం అయితే సన్మార్గంలో వెళ్తాడు. అదే చెడు అనుభవం అయితే జీవితానికి సరిపడా పాఠాలను నేర్చుకుంటాడు. నేటి కాలంలో చాలామంది మంచి అనుభవాల కంటే.. చెడు అనుభవాలను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. చివరికి అవి నేర్పిన గుణపాఠాలనుంచి బయటపడలేక నరకం చూస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ సంఘటన జరిగింది. నెల్లూరు పట్టణ ఏఎస్పీ దీక్ష ఇటీవల నగరంలో ఉన్న అన్ని […]

Students Lodge Incident: అనుభవం అనేది ఒక మనిషిని అనేక రకాలుగా మార్చేస్తూ ఉంటుంది. అది మంచి అనుభవం అయితే సన్మార్గంలో వెళ్తాడు. అదే చెడు అనుభవం అయితే జీవితానికి సరిపడా పాఠాలను నేర్చుకుంటాడు. నేటి కాలంలో చాలామంది మంచి అనుభవాల కంటే.. చెడు అనుభవాలను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. చివరికి అవి నేర్పిన గుణపాఠాలనుంచి బయటపడలేక నరకం చూస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో ఓ సంఘటన జరిగింది. నెల్లూరు పట్టణ ఏఎస్పీ దీక్ష ఇటీవల నగరంలో ఉన్న అన్ని లాడ్జిలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు కుర్రాళ్ళు పట్టుబడ్డారు. వారితోపాటు ఓ 40 సంవత్సరాల మహిళ కూడా ఉంది. రాయడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి.. అక్కడ ఏం జరిగిందో ప్రత్యేకంగా మీకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ నలుగురు కుర్రాళ్ళు నెల్లూరు నగరంలో చదువుతున్నారు. ఇటీవల కాలంలో స్మోకింగ్ చేస్తున్నారు. సినిమాలలో మాదిరిగా బైక్లతో విన్యాసాలు కూడా చేస్తున్నారు. అక్కడితో ఆగిపోలేదు వారు.. వయసు మీద ఉండడంతో ఏదో కావాలని అనుకున్నారు.

ఈ విషయాన్ని తమకు తెలిసిన కొంతమంది మిత్రులతో చర్చిస్తే.. వారిలో కొందరు ఒక నెంబర్ ఇచ్చారు. దీంతో ఆ నలుగురు కుర్రాళ్ళు ఆ నంబర్ కు ఫోన్ చేశారు. అవతల వైపు నుంచి ఒక ఆడ గొంతు.. ఎంతమంది ఉన్నారు అని అడిగింది.. మేం నలుగురం ఉన్నామని ఇవతల వైపు నుంచి ఈ కుర్రాళ్ళు చెప్పారు. మొత్తానికి డీల్ కుదిరింది. నెల్లూరు నగరంలో ఉన్న ఒక లాడ్జికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. సినిమా స్టైల్ లో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ నలుగురు కుర్రాళ్ళు.. ఆంటీ ఉన్న రూమ్ తలుపు కొట్టారు. ఆ నలుగురు కుర్రాళ్ళు భయం భయంగానే తలుపు తీశారు. ఎదురుగా పోలీసులు.. అప్పటికే ఆ కుర్రాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. ఏడుపు మొదలుపెట్టారు.

పోలీసులు ఆ కుర్రాళ్లను పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. వారిదైన మర్యాద చేశారు. దీంతో ఆ కుర్రాళ్ళు తప్పైందని క్షమించమని వేడుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తల్లిదండ్రుల ముందు ఆ కుర్రాళ్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాదు వారు చదువుతున్న కాలేజీ యాజమాన్యానికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. అటు ఇంట్లో.. ఇటు చదువుతున్న కాలేజీలో.. పరువు పోయి ఆ కుర్రాళ్ళు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. అందువల్లే అంటారు అనుభవం అనేది వయసుతో రావాలి. వయసులో ఉన్నప్పుడు అనుభవం కోసం పాకులాడకూడదు. అలా చేస్తే ఇదిగో ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper