spot_img
Homeక్రైమ్‌Jawahar Nagar crime news: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే...

Jawahar Nagar crime news: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు

Jawahar Nagar crime news: నేటి కాలంలో మనుషుల మధ్య ఆత్మీయత అనేది తగ్గిపోతోంది. అనురాగమనేది దూరమవుతోంది. అవసరాలు మాత్రమే మనుషుల మధ్య ఉంటున్నాయి. అవసరం తీరిన తర్వాత నీ తీరు నీదే.. నా తీ రు నాది అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది. చివరికి పేగు బంధం కూడా అవసరాల మధ్య పలుచన అవుతోంది. ఈ తరహా దారుణాలు విపరీతంగా చోటు చేసుకున్నప్పటికీ.. మనుషుల మధ్య మార్పు రావడం లేదు.

హైదరాబాద్ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న జవహర్ నగర్ పరిధిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా పరిధిలోకి వచ్చే జవహర్ నగర్ లోని అంజు అనే మహిళ అదృశ్యమైంది. దీనికి సంబంధించి పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విచారణ సాగిస్తుండగా విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి.

పోలీసులు సాగించిన విచారణలో అంజును ఆమె చిన్న కుమార్తె ఇషిక.. భర్త రాజ్ పుత్ చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల ఎదుట ఇషిక నిజం ఒప్పుకుంది. అంజూను చంపేసి.. ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పూర్తి వేసినట్టు ఇషిక ఒప్పుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో పూడ్చిపెట్టిన అంజు మృతదేహాన్ని వెలికి తీస్తున్నారు.

అంజు గత ఏడాది మే నెల నుంచి కనిపించడం లేదు. ఆమె బైక్ కూడా అదృశ్యమైంది. దీంతో పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఎన్ని విధాలుగా విచారణ సాగించినప్పటికీ ఎటువంటి ఆధారం లభించలేదు. అయితే ఇటీవల అంజు ద్విచక్ర వాహనాన్ని రామ్ కోటి ప్రాంతంలో అమ్మడానికి మౌంట్ ఈ రాజ్ పుత్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. దానికంటే ముందు ఆ షాప్ యజమాని వివరాలు అడిగితే రాజ్ పుత్ పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో షాప్ యజమాని పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిదైన శైలిలో విచరించగా.. అసలు విషయాన్ని చెప్పాడు.. మంజు చిన్న కూతురు ఇషిక.. తను ప్రేమించుకున్నామని.. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మంజును హత్య చేశామని చెప్పాడు. మంజును హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టామని అతడు వెల్లడించాడు. అయితే ఇన్ని రోజులపాటు ఇషిక నోరు విప్పలేదు. చివరికి ఆ బైక్ నిందితులను పట్టించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular