Homeక్రైమ్‌Jharkhand woman case: భర్త, ముగ్గురు పిల్లలు..ఇన్ స్టా ప్రియుడి కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయింది....

Jharkhand woman case: భర్త, ముగ్గురు పిల్లలు..ఇన్ స్టా ప్రియుడి కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ ఇల్లాలి పరిస్థితి ఏమైందంటే?

Jharkhand woman case: సోషల్ మీడియా వల్ల జరిగే మంచి ఎంతైతే ఉందో.. జరిగే చెడు కూడా అదే స్థాయిలో ఉంది. అందువల్లే సోషల్ మీడియాను సాధ్యమైనంతవరకు పరిమిత స్థాయిలో ఉపయోగించుకోవడం మంచిది. సోషల్ మీడియాను వినియోగించుకునే క్రమంలో కొంతమంది హద్దులు దాటి పోతుంటారు. సోషల్ మీడియాలో కనిపించేది మొత్తం నిజమని భావిస్తుంటారు. వాస్తవాన్ని పక్కన పెట్టి కృత్రిమ ప్రపంచంలో జీవించడం మొదలుపెడతారు. కృత్రిమ ప్రపంచం కొంతవరకు రంగుల లోకంగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ తర్వాతే […]

Jharkhand woman case: సోషల్ మీడియా వల్ల జరిగే మంచి ఎంతైతే ఉందో.. జరిగే చెడు కూడా అదే స్థాయిలో ఉంది. అందువల్లే సోషల్ మీడియాను సాధ్యమైనంతవరకు పరిమిత స్థాయిలో ఉపయోగించుకోవడం మంచిది.

సోషల్ మీడియాను వినియోగించుకునే క్రమంలో కొంతమంది హద్దులు దాటి పోతుంటారు. సోషల్ మీడియాలో కనిపించేది మొత్తం నిజమని భావిస్తుంటారు. వాస్తవాన్ని పక్కన పెట్టి కృత్రిమ ప్రపంచంలో జీవించడం మొదలుపెడతారు. కృత్రిమ ప్రపంచం కొంతవరకు రంగుల లోకంగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ తర్వాతే అసలు వాస్తవం బోధపడుతుంది. అప్పటికి నెత్తినోరు కొట్టుకున్నప్పటికీ ఉపయోగముండదు

ఇటువంటి పరిస్థితి ఈ మహిళకు ఎదురైంది.. ఆమె తీసుకున్న నిర్ణయం జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. జార్ఖండ్ రాష్ట్రంలో దుమ్కా ప్రాంతంలో ఓ మహిళ ఉంది. ఆమెకు 30 సంవత్సరాల వయసు. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

భర్త స్థానికంగా ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. ఆ మహిళ ఇంటి వద్దనే ఉంటుంది. అయితే ఆమెకు ఇంస్టాగ్రామ్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అధికస్త వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. అంతేకాదు ఆ వ్యక్తి తాను ఒక ధనవంతుడినని చెప్పుకున్నాడు.

తన భర్తకు అంతంత మాత్రమే ఆదాయం ఉండడం.. అప్పుడప్పుడు ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో భర్త మీద ఆమెకు కోపం కలిగింది.. ఇదే సమయంలో ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి తనను తాను శ్రీమంతుడిగా చెప్పుకోవడంతో అతని మీద ఇష్టాన్ని పెంచుకుంది.

ఒకానొక రోజు భర్తను వదిలేసి.. ముగ్గురు పిల్లల్ని వదిలేసి తన ప్రియుడి కోసం వెళ్ళిపోయింది. ఆ ప్రియుడు ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలో.. బీహార్ నుంచి మచిలీపట్నానికి దాదాపు 1400 కిలోమీటర్లు ఆమె ప్రయాణించింది. తన ప్రియుడి వద్దకు వచ్చిన తర్వాత ఆమెకు వాస్తవం తెలిసింది.. శ్రీమంతుడుగా చెప్పుకున్న ఆమె ప్రియుడు ఒక సుతారి మేస్త్రి. దీంతో ఆ మహిళ ఒకసారిగా షాక్ కు గురైంది. భార్య తప్పిపోవడంతో ఆమె భర్త జార్ఖండ్ రాష్ట్రంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు లొకేషన్ ఆధారంగా గుర్తించి ఆమెను మచిలీపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నారు. బీహార్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.. ఇంత జరిగినప్పటికీ ఆమె భర్త భార్య మీద ప్రేమతో.. దగ్గరకి తీసుకున్నాడు. పిల్లలు అనాధలు అయిపోతారని భావించి.. అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper